రోజు రోజుకీ సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. రోబోలను వివిధ రకాలుగా వినియోగించుకుంటున్నారు మనుషులు. మర మనిషిని సర్వర్‌గా ఉపయోగిస్తున్నారు మహారాష్ట్రలోని ఠాణే రెస్టారెంట్ యజమాని. రోబోకు బేబి డాల్ అని నామకరణం చేశాడు.
బేబి డాల్ వంటగది నుంచి కస్టమర్ బల్ల వద్దకు కోరిన ఆహారాన్ని తీసుకెళుతుంది. ఈ రోబో పూర్తిగా వైఫై ద్వారా పనిచేస్తుంది. టేబుళ్లకు రేడియో ఫ్రీక్వెన్సీలను ఏర్పాటు చేశారు. ఈ సాంకేతికత ద్వారా టేబుల్ నెంబర్‌ను రోబోకు ఫీడ్ చేస్తారు. ఆ ఆదేశం ప్రకారం బల్ల వద్దకు వెళ్లి కస్టమర్లకు ఆహారాన్ని అందిస్తుంది బేబి.
మహారాష్ట్రలో మొట్టమొదటి రోబోటిక్ రెస్టారెంట్ ఇదే. కస్టమర్లను ఆకట్టుకొని, అమ్మకాలను పెంచుకోవాలనే ఆలోచనతోనే రోబోను ఏర్పాటు చేశామని యజమాని తెలిపారు. రోబో కదిలేటప్పుడు మార్గం మధ్యలో ఎవరైనా అడ్డువచ్చినప్పుడు దయచేసి 'నేను వెళ్లటానికి దారి ఇవ్వండి' అని అడుగుతుంది బేబి. ఈ మాటలు కస్టమర్లను ఎంతో ఆకర్షిస్తాయని రెస్టారెంట్ యజమాని చెబుతున్నారు.
ఇదీ చూడండి:కశ్మీర్‌పై తీర్మానం ఫైల్ చేయలేకపోయిన పాక్