జమ్ముకశ్మీర్ ద్రాస్‌లోని కార్గిల్ యుద్ధ స్మారకాన్ని సందర్శించారు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. భారత సైన్యం చేపట్టిన 'ఆపరేషన్ విజయ్'కు 20 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా జవాన్ల త్యాగాలను గుర్తుచేసుకున్నారు.
యుద్ధ స్మారకం వద్దకు చేరుకున్న అనంతరం సందర్శకుల పుస్తకంలో తన సందేశం రాశారు రక్షణ మంత్రి. యుద్ధ స్మారకం వద్ద అమర జవాన్లకు నివాళులర్పించారు. వారి త్యాగాలు ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన 'మెమోరీ లేన్' చిత్రాలను జాతికి అంకితం చేశారు రాజ్‌నాథ్. అనంతరం సైనికులతో కలిసి ఫోటోలు దిగారు.
విజయ జ్యోతి..
ఈ నెల 14న దిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద కార్గిల్ యుద్ధం 'విజయ జ్యోతి'ని వెలిగించారు రాజ్‌నాథ్. ఆ జ్యోతిని సైన్యానికి చెందిన ద్విచక్రవాహనాల బృందానికి అందించారు. పలు పట్టణాలను దాటుతూ ద్రాస్ చేరుకుని ఈ నెల 26న కార్గిల్ యుద్ధ స్మారకం వద్ద అమర జ్యోతిలో మమేకమవనుంది విజయ జ్యోతి.
ఇదీ చూడండి: చంద్రయాన్: తొలి అడుగుకు అర్ధ శతాబ్దం