ETV Bharat / bharat

ఆర్​జేడీ హామీలు: 10లక్షల ఉద్యోగాలు- రుణ మాఫీ

author img

By

Published : Oct 24, 2020, 11:57 AM IST

బిహార్​ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆర్​జేడీ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు ఆ పార్టీ నేత తేజస్వీ యాదవ్​. తాము అధికారంలోకి వచ్చిన అనంతరం 10లక్షల ఉద్యోగాలిస్తామని.. రైతుల రుణాలు మాఫీ చేస్తామని హామీనిచ్చారు యాదవ్​.

RJD releases Bihar poll manifesto, promises 10L jobs
'10లక్షల ఉద్యోగాలు- రైతు రుణాలు మాఫీ'

తాము అధికారంలోకి వస్తే బిహార్ ప్రజలకు 10లక్షల ఉద్యోగాలిస్తామని ఆర్​జేడీ నేత, మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్​ హామీ ఇచ్చారు. రైతుల రుణాలు మాఫీ చేస్తామన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం.. పట్నాలో పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆర్​జేడీ హామీలు...

  • రాష్ట్రంలో ఉన్న 17 సమస్యలకు ప్రాధాన్యం
  • 10లక్షల ఉద్యోగాలపై తొలి కేబినెట్​ సమావేశంలోనే నిర్ణయం
  • పనికి తగ్గ వేతనం
  • కాంట్రాక్ట్​ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి చేర్చుకోవడం
  • ప్రైవేటీకరణకు స్వస్తి
  • అన్ని నీటిపారుదల పంపులను సౌర పంపులుగా మార్చడం
  • బిహార్​లో క్రీడా విశ్వవిద్యాలయం
  • ప్రతి డివిజన్​లోనూ పెద్ద స్టేడియం
  • ప్రభుత్వ ఉద్యోగులకు ముందస్తు పింఛను వ్యవస్థ
  • ప్రత్యేక ఆర్థిక జోన్ల ఏర్పాటు
  • విద్యుత్​ రేట్లలో కోత
  • రైతు రుణాల మాఫీ

కాంగ్రెస్​,సీపీఐ,సీపీఎం​తో కలిసి బిహార్​ ఎన్నికల్లో 'మహాకూటమి'గా బరిలో దిగనుంది ఆర్​జేడీ. మహాకూటమికి సంబంధించిన మేనిఫెస్టోను ఇప్పటికే విడుదల చేశారు.

243 అసెంబ్లీ స్థానాలకు మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 28, వచ్చే నెల 3,7 తేదీల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అదే నెల 10న ఫలితాలు వెలువడనున్నాయి.

ఇవీ చూడండి:-

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.