ETV Bharat / bharat

కర్ణాటకలో భారీ వర్షాలతో ఉప్పొంగిన నదులు

భారీ వర్షాలు ఉత్తర కర్ణాటకను అతలాకుతలం చేస్తున్నాయి. సుమారు 35 వేల మంది ప్రజలు వరద ముంపు బారిన పడ్డారు. కృష్ణ ఉపనదులు.. ముఖ్యంగా భీమా నది ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తోంది. పరీవాహక జిల్లాల్లో భారీ నష్టాన్ని కలగజేశాయి.

Karnataka
కర్ణాటక
author img

By

Published : Oct 20, 2020, 5:23 AM IST

ఉత్తర కర్ణాటకలో కురిసిన భారీ వర్షాలకు 35 వేల మందికిపైగా ప్రజలు వరద ముంపు బారిన పడ్డారని ఆ రాష్ట్ర అధికారులు తెలిపారు. కలబుర్గి, విజయపుర, యాదగిరి, రాయచూర్‌ జిల్లాల్లోని అనేక గ్రామాలు ఈ వరద ప్రభావానికి గురయ్యాయి.

వరద ఉద్ధృతి కొనసాగుతున్న కారణంగా భీమా నది ప్రమాదకర స్థాయికి మించి ‌ప్రవహిస్తోంది. భారీ వర్షాల కారణంగా కృష్ణా నది ఉపనదులు జిల్లాల్లో భారీ నష్టాన్ని కలుగజేశాయి.

97 గ్రామాలు..

వరదల ఉద్ధృతికి నాలుగు జిల్లాల్లోని 97 గ్రామాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని కర్ణాటక విపత్తు నిర్వహిణ బృందం తెలిపింది.

ఆయా గ్రామాల్లోని 36,290 మంది ప్రజలను 174 పునరావాస శిబిరాలకు తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు.

రాజధానిలో..

బెంగళూరులోని పలు ప్రాంతాల్లోనూ ఆదివారం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. బెంగళూరులో రికార్డు స్థాయిలో 39.6 మిల్లీ మీటర్ల వర్షపాతం కురిసిట్లు భారత వాతావరణ శాఖ పేర్కొంది.

ఇదీ చూడండి: మహారాష్ట్రలో భారీ వర్షాలు- పుణెలో రోడ్లు జలమయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.