అసోం జోర్హట్, కాజీరంగా జాతీయ పార్కులో స్వలాభం కోసం మూగజీవి ప్రాణం తీశారు వేటగాళ్లు. దేశంలో అరుదుగా కనిపించే ఖడ్గమృగాన్ని తుపాకీతో కాల్చి చంపారు. ఖడ్గమృగం ముక్కు మీది కొమ్మును కోసి తీసుకెళ్లారు.
గబ్రాయి, మెటేకా పరిథిలో వన్యప్రాణి సంరక్షణ విభాగాధికారులు పెట్రోలింగ్ నిర్వహిస్తుుండగా.. వేటగాళ్ల పాదముద్రలు కనిపించాయి. ఆ అడుగుల వెంటే వెళ్లగా ఖడ్గమృగం కళేబరం లభించింది. ఖడ్గమృగం కొమ్మ కాజేసేందుకే వేటగాళ్లు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని అధికారులు భావిస్తున్నారు. ఘటనా స్థలంలో ఆరు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనలో ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: ఇమ్యూనిటీ బూస్టర్ 'ఆయుష్ చిక్కీ'తో కరోనా పరార్!