"ప్రతిసారి ఇదే చెబుతారు. కొందరు రూ.15 లక్షలు ఇస్తామంటారు. కొందరు రూ.12 వేలు అంటారు. కానీ మాకేం రాదు. ఇక్కడ మాకు కుళాయి ఉన్నా నీరు రాదు. తాగునీటి కోసమే చాలా దూరం వెళ్లాల్సి వస్తోంది."
- మహ్మద్ ఆరిఫ్, కాన్పూర్
"రాహుల్ ప్రధాని అయితే చెప్పింది కచ్చితంగా చేస్తారు. ఎందుకంటే ఇప్పటివరకు చెప్పినవన్నీ చేశారు. మోదీ మాత్రం అలా కాదు."
- ఖుర్షీద్ అలీ ఖాన్, అహ్మదాబాద్
"ఇప్పటివరకు ఏ ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదు. ఉత్తరప్రదేశ్లో అఖిలేశ్ అంతో ఇంతో చేశారు. మాయావతి అందరికీ కన్నా ఉత్తమంగా పనిచేశారు."
-గృహిణి, కాన్పూర్
"పేదవాళ్లకు మోదీ ఏం చేయలేదు. రాహుల్ వస్తే పరిస్థితి మారుతుందేమో? రోజురోజుకు ధరలు పెరుగుతున్నాయి. ప్రజలు ఎంత సంపాదిస్తున్నారు? ఇలా అయితే వాళ్లేం తింటారు?"
-ఆసియా భాను, అహ్మదాబాద్
"నాకు తెలిసి ఇదో ఎన్నికల హామీ. ఎన్నికల్లో కాకుండా వేరే సందర్భంలో ఇస్తే మరింత ప్రభావం ఉండేది. ఎన్నికల్లో కొత్త ట్రెండు ప్రారంభమైంది. డబ్బులను ప్రజల ఖాతాల్లో నేరుగా జమచేస్తూ ఓట్లను పొందేందుకు ప్రయత్నిస్తున్నాయి పార్టీలు. ఇది ఓ రకంగా సహాయం చేయవచ్చు. దేశంలో పేదలే ఎక్కవ శాతం ఉన్నారు. ఇందులో రాయితీ, సంక్షేమ పథకాలున్నాయి. దీనిని ప్రారంభిస్తే మిగిలిన సంక్షేమ పథకాలన్నింటినీ ఆపాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఇది సాధ్యమవుతుంది. కాంగ్రెస్ వాళ్లు చెబుతున్నారు.. ఇది పేదరికంపై చివరి పోరాటమని. నాకు తెలిసి వరుస పరాజయాలతో ఉన్న కాంగ్రెస్ ఓట్ల కోసమే ఈ పోరాటం. ఏదేమైనా నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా. కానీ ఆచరణ చాలా కష్టం"
-శరద్ కోహ్లీ, ఆర్థికవేత్త
ఇవీ చూడండి: