ETV Bharat / bharat

'ఆ విషయంలో మోదీకే ప్రయోజనం ఎక్కువ' - AMERICA PRESIDENT TRUMP LATEST NEWS

మోదీ వెనుక 1.5 బిలియన్ల మంది​​ ప్రజలు ఉండటం ఆయనకు కలిసొచ్చే విషయమని ట్రంప్​ అభిప్రాయపడ్డారు. ఫేస్​బుక్​లో ఇరువురు నేతలను అనుసరిస్తోన్న వారి సంఖ్యను దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా వ్యాఖ్యనించారు ట్రంప్​.

representing-1-dot-5-billion-people-modi-has-an-advantage-on-facebook-trump
ఆ విషయంలో మోదీకే ప్రయోజనం ఎక్కువ'
author img

By

Published : Feb 21, 2020, 12:30 PM IST

Updated : Mar 2, 2020, 1:31 AM IST

ఫేస్​బుక్​, ట్విట్టర్​.. ఇలా ఏ సామాజిక మాధ్యమంలోనైనా తానే రారాజునని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ అనేకమార్లు ప్రకటించారు. ఫేస్​బుక్​లో అనుసరిస్తోన్న వారి సంఖ్యను దృష్టిలో పెట్టుకుని.. తాను నెం.1 అని, నెం.2 భారత ప్రధాని నరేంద్ర మోదీ అని ఇటీవల వ్యాఖ్యానించారు ట్రంప్​.

అయితే.. 1.5 బిలియన్​ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుండటం వల్ల మోదీకి అధిక ప్రయోజనం ఉంటుందని తాజాగా అభిప్రాయపడ్డారు ట్రంప్​.

"వచ్చే వారం నేను భారత్​కు వెళ్తున్నా. అక్కడ 150 కోట్ల​ మంది ప్రజలు ఉంటారు. ఫేస్​బుక్​లో మోదీది రెండో స్థానం. మొదటి స్థానం ఎవరిదో తెలుసా? ట్రంప్​. నమ్మగలరా? నాకూ ఇప్పుడే తెలిసింది. కానీ మోదీకి అభినందనలు. ఆయన 1.5 బిలియన్​ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నేను 350 మిలియన్ల మందికే​. ఆయన నాకంటే ముందువరుసలో ఉన్నారు."

--- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు.

అధికారిక లెక్కల ప్రకారం.. భారత్​లో 1.3 బిలియన్​(130కోట్లు) ప్రజలు ఉన్నారు. మోదీకి 44 మిలియన్​ ప్రజల ఫాలోయింగ్​ ఉంది. అమెరికా జనాభా 325 మిలియన్​. ట్రంప్​ను 27 మిలియన్​ల మంది అనుసరిస్తున్నారు. అయితే తాను నెం.1 అన్న విషయాన్ని ఫేస్​బుక్​ సీఈఓ జుకర్​బర్గ్​ స్వయంగా చెప్పినట్టు ట్రంప్​ వెల్లడించారు.

ఇదీ చూడండి:- భారత్​పై​ ట్రంప్​ గుర్రు.. సుంకాల రారాజుగా అభివర్ణణ

Last Updated : Mar 2, 2020, 1:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.