ETV Bharat / bharat

కార్మికులకు ఆరోగ్యమస్తు!

author img

By

Published : Nov 21, 2020, 10:16 AM IST

వివిధ సంస్థల్లో పనిచేసే కార్మికులకు ఊరట కలిగించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 45 ఏళ్లు నిండిన కార్మికులందరికీ వారి యజమానులే ఏటా ఉచిత వైద్య ఆరోగ్య పరీక్షలు జరిపించాలని ప్రతిపాదించింది. ఇటీవల తీసుకొచ్చిన వృత్తిపర భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల స్మృతి-2020 కింద తాజాగా ముసాయిదా నిబంధనలు జారీ చేసింది. ఇందులోని కీలక అంశాలు తెలుసుకుందాం.

Labor health Examination
కార్మికులకు ఆరోగ్యమస్తు

వివిధ సంస్థల్లో పనిచేసే 45 ఏళ్లు నిండిన కార్మికులందరికీ వాటి యజమానులు ఏటా ఉచిత వైద్య ఆరోగ్య పరీక్షలు జరిపించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన 'వృత్తిపర భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల స్మృతి-2020' (ఆక్యుపేషనల్‌ సేఫ్టీ, హెల్త్‌ అండ్‌ వర్కింగ్‌ కండీషన్స్‌ కోడ్‌) కింద తాజాగా ముసాయిదా నిబంధనలు జారీ చేసింది. దీనిపై అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఉంటే 45 రోజుల్లోపు తమకు పంపాలని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ నిబంధనలు కర్మాగారాలు, భవనాలు, ఇతర నిర్మాణపనులు, గనులు, అంతర్రాష్ట్ర వలస కార్మికులు, కాంట్రాక్ట్‌ సిబ్బంది, వర్కింగ్‌ జర్నలిస్టులు, ఆడియో-విజువల్‌ వర్కర్లు, సేల్స్‌ ప్రమోషన్‌ ఉద్యోగులకు వర్తిస్తుందని తెలిపింది.

ముఖ్యాంశాలు..

  • కార్మికులందరికీ నిర్దిష్టమైన నమూనాలో ఉద్యోగ నియామకపు ఉత్తర్వు ఇవ్వాలి. వాళ్ల నైపుణ్య కేటగిరీ, వేతనంతో పాటు, ఉన్నత వేతనం/స్థానం పొందడానికి ఉన్న మార్గాలను అందులో పొందుపరచాలి. ఈ నిబంధనలు అమల్లోకి వచ్చిన మూడునెలల్లోపు ఉద్యోగికీ ఇది జారీచేయాలి. అపాయింట్‌మెంట్‌ లెటర్‌ ఇవ్వకుండా ఏ సంస్థలోనూ ఉద్యోగిని చేర్చుకోవడానికి వీల్లేదు.
  • కర్మాగారాలు, ఓడరేవులు, గనులు, భవనాలు, ఇతర నిర్మాణ పనుల్లో పాల్గొనే 45 ఏళ్లపైబడిన కార్మికులందరికీ ఏటా యజమానే ఉచిత వైద్య పరీక్షలు చేయించాలి.
  • అంతర్రాష్ట్ర వలస కార్మికులు ఏటా ఒకసారి తమ సొంత ఊళ్లకు వచ్చి వెళ్లడానికి వీలుగా ప్రయాణభత్యాలు ఇవ్వాలి. వారి సమస్యలను సకాలంలో పరిష్కరించడానికి వీలుగా ఒక టోల్‌ఫ్రీ నెంబర్‌ ఏర్పాటు చేయాలి.
  • దేశవ్యాప్తంగా ఒకటికి మించిన రాష్ట్రాలకు కాంట్రాక్ట్‌ లేబర్‌ను సరఫరా చేయడానికి, వారితో పనిచేయించుకోవడానికి కాంట్రాక్టర్‌కు అయిదేళ్లకాలానికి ఒకే లైసెన్సు మంజూరు చేస్తారు. ప్రస్తుతం వర్క్‌ ఆర్డర్‌ను బట్టి ఈ లైసెన్సు మంజూరు చేస్తుండగా, ఇకమీదట ఒకేసారి అయిదేళ్లకు ఇస్తారు.
  • పనులను ప్రధానం (కోర్‌), అప్రధానం (నాన్‌ కోర్‌)గా విభజించాలి. కాంట్రాక్ట్‌ లేబర్‌ను ప్రధాన కార్యాకలాపాల్లో నియమించకూడదు.
  • కాంట్రాక్ట్‌ కార్మికుల వేతనాల విషయానికి వస్తే.. 1. వేతన సమయాన్ని కాంట్రాక్టర్‌ ఖరారు చేయాలి. వేతన చెల్లింపు సమయం నెలకు మించకూడదు. 2. కాంట్రాక్ట్‌ లేబర్‌ వేతనాలను వేజ్‌ పీరియడ్‌ ముగిసిన ఏడు రోజుల్లోపు చెల్లించాలి. 3. వేతనాలు బ్యాంకు ద్వారాగానీ, ఎలక్ట్రానిక్‌ రూపంలోగానీ అందించాలి.
  • ఉద్యోగుల భద్రత, ఆరోగ్యసంబంధ విషయాలు పరిశీలించడానికి 500, అంతకుమించి ఉద్యోగులున్న సంస్థల్లో తప్పనిసరిగా సేఫ్టీ కమిటీలు ఏర్పాటుచేయాలి.
  • ఉదయం 6 గంటలలోపు, రాత్రి 7 గంటల తర్వాత మహిళ ఉద్యోగులు పని చేస్తున్నట్లయితే వారి అనుమతితోనే అక్కడ భద్రతాపరమైన నిబంధనలు రూపొందించాలి.
  • ఓవర్‌ టైంను లెక్కించేటప్పుడు 15-30 నిమిషాల మధ్య సమయాన్ని 30 నిమిషాల కింద పరిగణించాలి. ప్రస్తుతం 30 నిమిషాలలోపు సమయాన్ని ఓవర్‌టైం కింద లెక్కించడంలేదు. ఇక మీదట ఈ నిబంధన మారుతుంది.

ఇదీ చూడండి: కామ్రేడ్ల మధ్య 'మోదీ భాయ్​- దీదీ భాయ్' చిచ్చు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.