ETV Bharat / bharat

44వ రోజూ కొత్త కేసుల కన్నా రికవరీలే అధికం - corona virus india

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లోనూ కేసుల సంఖ్యలో సోమవారం స్పల్ప తగ్గుదల కనిపించింది. వరుసగా 44వ రోజూ కొత్త కేసుల కన్నా రికవరీలే అధికంగా నమోదయ్యాయి.

CORONA
కరోనా వైరస్
author img

By

Published : Nov 16, 2020, 8:26 PM IST

భారత్​లో వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. చాలా రాష్ట్రాల్లో కొత్త కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోంది.

  • మహారాష్ట్రలో కొత్తగా 2,535 మందికి కరోనా సోకింది. 60 మంది మరణించారు. ఫలితంగా మొత్తం మృతుల సంఖ్య 46,034కు చేరింది. ప్రస్తుతం 84,386 యాక్టివ్ కేసులున్నాయి. ముంబయిలో 409 కేసులు నమోదయ్యాయి.
  • తమిళనాడులో ఆదివారం కొత్తగా 1,725 మందికి వైరస్​ సోకింది. 17 మంది మృతి చెందారు. మొత్తం మృతుల సంఖ్య 11,495గా ఉంది. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 15,765కు తగ్గింది.
  • కర్ణాటకలో కొత్తగా 1,157 మంది వైరస్​ బారిన పడ్డారు. 12 మంది మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 11,541కి చేరింది. ప్రస్తుతం 26 వేలకు పైగా యాక్టివ్​ కేసులుండగా మొత్తం కేసుల సంఖ్య 8,62,804గా ఉంది.
  • కేరళలో కొత్తగా 2,710 మంది వైరస్ బారినపడగా 6,567 మంది కోలుకున్నారు. సోమవారం 19 మంది మరణించారు. రాష్ట్రంలో క్రియాశీల కేసుల సంఖ్య 70,925గా ఉంది.

పెరిగిన రికవరీ రేటు..

వరుసగా 44వ రోజూ కరోనా వైరస్ కొత్త కేసుల కన్నా కోలుకున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అమెరికా, ఐరోపా దేశాల్లో కేసుల సంఖ్యలో భారీ పెరుగుదల కనిపిస్తుండగా, భారత్‌లో మాత్రం జులై 13 తరవాత మొదటిసారి తక్కువ కేసులు(30,548) నమోదవడం ఊరటకలిగించే అంశమని తెలిపింది.

ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 4,65,478గా ఉంది. కాగా, క్రియాశీల కేసుల రేటు 5.26 శాతానికి తగ్గింది. రికవరీ రేటు 93.27 శాతానికి పెరిగింది. 24 గంటల వ్యవధిలో కోలుకున్న కేసులలో 78.59 శాతం 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవేనని మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇదీ చూడండి: కరోనా వ్యాప్తిపై కేంద్ర హోంశాఖ కీలక సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.