ETV Bharat / bharat

'ప్లేస్​ ఏదైనా సరే.. దీదీతో చర్చకు సై'

బంగాల్​ ప్రభుత్వానికి, రాజ్​భవన్​కు మధ్య కొనసాగుతోన్న వివాదాల పరిష్కారానికి చర్చలే మార్గమని రాష్ట్ర గవర్నర్​ జగదీప్​ ధన్​ఖర్​ అభిప్రాయపడ్డారు. వీటి పరిష్కారానికి సీఎం మమతా బెనర్జీతో చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

Ready to discuss all issues with CM: Governor Jagdeep Dhankhar
'ప్లేస్​ ఏదైనా సరే.. దీదీతో చర్చకు నేను సై'
author img

By

Published : Dec 6, 2019, 12:02 PM IST

Updated : Dec 6, 2019, 12:51 PM IST

మమతా బెనర్జీ సర్కారుకు, ఆ రాష్ట్ర గవర్నర్​కు మధ్య రోజుకొక వివాదం నడుస్తోంది. వీటికి స్వస్తి పలికేందుకు.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని రాష్ట్ర గవర్నర్​ జగదీప్​ ధన్​ఖర్​ స్పష్టం చేశారు.

సతీసమేతంగా ఈ రోజు అసెంబ్లీకి వెళ్లిన గవర్నర్​... డా. బీఆర్ అంబేడ్కర్​ విగ్రహానికి నివాళులు అర్పించారు. అసెంబ్లీ మార్షల్, కొంత మంది ఎమ్మెల్యేలు​ ఆయనకు స్వాగతం పలికారు. అయితే స్పీకర్​ బీమన్​ బెనర్జీ రాకపోవడం గమనార్హం. ఆయన వాణిజ్య సలహా కమిటీ భేటీలో ఉన్న కారణంగానే రాలేదని అసెంబ్లీ వర్గాలు వెల్లడించాయి.​ అనంతరం రాజ్​భవన్​, ప్రభుత్వానికి మధ్య నడుస్తోన్న వివాదంపై గవర్నర్​ స్పందించారు.

"ముందుకు సాగాలంటే చర్చలు ఒకటే మార్గం. అన్ని విషయాలపై ముఖ్యమంత్రితో ఎక్కడైనా చర్చించేందుకు నేను సిద్ధం. చర్చకు వేదికగా రాజ్​భవన్ లేదా నబన్నా (ముఖ్యమంత్రి కార్యాలయం) ఏదైనా ఫర్వాలేదు. ఈ మేరకు మమతా బెనర్జీకి నేను లేఖ రాశాను. మంగళవారం, ఫోన్​ లోనూ మాట్లాడాను."
- జగదీప్​ ధన్​ఖర్​, బంగాల్​ గవర్నర్​

నిన్న శాసనసభ సందర్శనకు వెళ్లిన గవర్నర్​కు చేదు అనుభవం ఎదురైంది. అసెంబ్లీలోకి ప్రముఖులు ప్రవేశించేందుకు ఉద్దేశించిన 3వ నెంబరు గేటుకు సిబ్బంది తాళం వేశారు. కాసేపు ఎదురుచూసిన గవర్నర్​... అధికారులు, మీడియా ప్రతినిధులకు కేటాయించిన 4వ నెంబరు గేటులో నుంచి లోపలకు వెళ్లారు. నేడు మాత్రం 3వ నెంబరు గేటు ద్వారా అసెంబ్లీకి వెళ్లారు ధన్​ఖర్​.

Varanasi (UP), Dec 06 (ANI): Women in Varanasi celebrated encounter of all four accused in Telangana rape-murder case. Women came out of their houses to celebrate. They distributed sweets. They hailed Hyderabad Police.
Last Updated : Dec 6, 2019, 12:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.