కర్ణాటక రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసును... కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ)కి అప్పగిస్తున్నట్లు ముఖ్యమంత్రి యడియూరప్ప తెలిపారు. దీనిపై స్పందించిన మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఈ కేసు విషయంలో అంతర్జాతీయ ఏజెన్సీ దర్యాప్తునకైనా సిద్ధమేనని స్పష్టం చేశారు.
ఇంతకీ ఏమిటీ వివాదం...
గత కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వ హయంలో... మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన అనుచరుల ఫోన్లను మిత్ర పక్షమైన జేడీఎస్ ట్యాప్ చేసిందని ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా జేడీఎస్ రెబల్ ఎమ్మెల్యే ఎ.హెచ్. విశ్వనాథ్... కుమారస్వామి ప్రభుత్వం, తనతో సహా 300 మంది రాజకీయ నేతల ఫోన్లను ట్యాప్ చేసిందని ఆరోపించారు. భాజపా నేత, మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ షెట్టర్... కుమారస్వామిపై నేరుగా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేశారు. అయితే జేడీఎస్ మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చుతోంది.
ట్రంప్తోనైనా దర్యాప్తు చేయించుకోండి
"ఫోన్ ట్యాపింగ్ కేసుపై... సీబీఐ లేదా అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన ఏ ఇతర ఏజెన్సీతోనైనా వారు దర్యాప్తు చేయనివ్వండి. లేదా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో అయినా మాట్లాడనివ్వండి. ఆయన వైపు నుంచి ఒకరి ద్వారా విచారించనివ్వండి."
- హెచ్డీ కుమారస్వామి, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత
మీడియాపై చిందులు
ఫోన్ ట్యాపింగ్ కేసుపై కవరేజ్‌కు వచ్చిన మీడియాపై కుమారస్వామి చిందులు తొక్కారు. 'నన్ను ఎవరూ ఏమీ చేయలేరు' అంటూ వ్యాఖ్యానించారు.
"ఎలక్టానిక్ మీడియా ప్రవర్తనను నేను గమనిస్తున్నాను. వారి ఉద్దేశం, ప్రయత్నాలు.. కుమారస్వామిని రాష్ట్ర రాజకీయాలు, ప్రజల నుంచి దూరం చేయడం. అయితే వారు ఇందులో విజయం సాధించలేరు."- కుమారస్వామి, మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత
కాంగ్రెస్‌లో... భిన్నవాదనలు
ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించడాన్ని కాంగ్రెస్ శాసనసభ పక్షనేత సిద్ధరామయ్య, మల్లికార్జున ఖర్గే, ఎమ్బీ పాటిల్ స్వాగతించారు. అయితే భాజపా.... సీబీఐ దర్యాప్తును 'రాజకీయ కక్ష సాధింపు' కోసం ఉపయోగించదని తాను ఆశిస్తున్నట్లు సిద్ధరామయ్య పేర్కొన్నారు.
-
I welcome the decision of @BSYBJP to hand over the phone tapping case to CBI.
— Siddaramaiah (@siddaramaiah) August 18, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
But, in the past, @BJP4India has used CBI as its puppet to unleash its venomous political vendetta. Hope @BJP4Karnataka leaders does not have similar intentions this time.@INCKarnataka
">I welcome the decision of @BSYBJP to hand over the phone tapping case to CBI.
— Siddaramaiah (@siddaramaiah) August 18, 2019
But, in the past, @BJP4India has used CBI as its puppet to unleash its venomous political vendetta. Hope @BJP4Karnataka leaders does not have similar intentions this time.@INCKarnatakaI welcome the decision of @BSYBJP to hand over the phone tapping case to CBI.
— Siddaramaiah (@siddaramaiah) August 18, 2019
But, in the past, @BJP4India has used CBI as its puppet to unleash its venomous political vendetta. Hope @BJP4Karnataka leaders does not have similar intentions this time.@INCKarnataka
కాంగ్రెస్ ముఖ్య నేత డీకే శివకుమార్ మాత్రం ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను ఖండించారు.
రౌడీలా ప్రవర్తిస్తున్నారు...
కాంగ్రెస్ పార్టీ తన అధికార ట్విట్టర్ ఖాతాలో.. టెలిఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు అబద్ధమని పేర్కొంది. భాజపా విద్వేషపూరిత రాజకీయ కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించింది.
"'ఆపరేషన్ కమల' ద్వారా అనైతిక పద్ధతిలో ముఖ్యమంత్రి అయిన యడియూరప్ప... అండర్‌గ్రౌండ్ క్రిమినల్‌గా వ్యవహరిస్తున్నారు. మోదీ ప్రభుత్వ హయాంలో సీబీఐ... భాజపా అనుబంధ సంస్థలా పనిచేస్తోంది."- కాంగ్రెస్ పార్టీ ట్వీట్
ఇదీ చూడండి: బ్రెగ్జిట్‌కు ముందు ఈయూ దేశాల్లో బోరిస్ పర్యటన