అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ట్రస్ట్‌కు సంబంధించి వివరాలను వెల్లడించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ట్రస్ట్‌కు సంబంధించి లోక్‌సభలో ప్రధాని నరేంద్రమోదీ ప్రకటన తర్వాత అమిత్ షా ఈ ట్వీట్ చేశారు.
"'శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర' ట్రస్ట్‌లో 15 మంది ట్రస్టీలు ఉంటారు. ఇందులో ఒకరు ఎస్సీ, ఎస్టీకి చెందిన వారికి అవకాశం ఉంటుంది. ఇటువంటి అసాధారణ నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీకి నా శుభాకాంక్షలు.
ట్రస్ట్ స్వతంత్రంగా వ్యవహరిస్తుంది. ఆలయానికి సంబంధించిన 67 ఎకరాల భూమిని ట్రస్ట్‌కు బదిలీ చేస్తాం.
శతాబ్దాలుగా కోట్లాది మంది నిరీక్షణకు త్వరలోనే ముగింపు పడుతుంది. రామజన్మభూమిలో రాముడికి పూజించే రోజు తొందరగానే వస్తుంది."
- అమిత్ షా, కేంద్ర హోంమంత్రి
మరిన్ని వివరాలకు ఈ కథనం చూడండి: రామమందిర నిర్మాణానికి స్వతంత్ర ట్రస్ట్: మోదీ