చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దేశ ప్రజలు అభద్రతా భావంతో ఉన్నారని చెప్పారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్రజల విశ్వాసం అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయిందన్నారు. ద్రవ్యపరపతి విధాన ప్రకటనను ఉద్దేశిస్తూ... ప్రజల మానసిక స్థితిని ఆర్బీఐ వెల్లడించిందని ట్వీట్ చేశారు.
-
RBI reveals the real 'Mood of the Nation':
— Rahul Gandhi (@RahulGandhi) August 7, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
People's confidence at all time low.
Fear and insecurity at all time high.
Expect more bad news on the economy and jobs front. pic.twitter.com/zaOWwwys8d
">RBI reveals the real 'Mood of the Nation':
— Rahul Gandhi (@RahulGandhi) August 7, 2020
People's confidence at all time low.
Fear and insecurity at all time high.
Expect more bad news on the economy and jobs front. pic.twitter.com/zaOWwwys8dRBI reveals the real 'Mood of the Nation':
— Rahul Gandhi (@RahulGandhi) August 7, 2020
People's confidence at all time low.
Fear and insecurity at all time high.
Expect more bad news on the economy and jobs front. pic.twitter.com/zaOWwwys8d
" భారతదేశ వాస్తవ స్థితిని ఆర్బీఐ వెల్లడించింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లింది. భయం, అభద్రతా భావంతో ఉన్నారు. ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాలకు సంబంధించి ఇంకా బాధాకరమైన వార్తాలు వినాల్సి రావచ్చు."
-రాహుల్ ట్వీట్.
ప్రజల విశ్వాసం ఏ స్థాయిలో పడిపోతోందో తెలిపే ఓ గ్రాఫ్‌ను ట్వీట్‌కు జత చేశారు రాహుల్.
ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని వడ్డీరేట్లలో మార్పులు చేయడం లేదని గురువారం ప్రకటించింది ఆర్బీఐ. కరోనా సంక్షోభం కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత బలహీన స్థితిలో ఉందని పేర్కొంది.
ఇదీ చూడండి: 'నవ భారత్ నిర్మాణానికి కొత్త విద్యా విధానమే పునాది'