ETV Bharat / bharat

వందనాలతో మొదలై.. విందుతో ముగిసె..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ రెండు రోజుల భారత పర్యటన విజయవంతంగా ముగిసింది. తొలిరోజు పలు సందర్శన ప్రదేశాలు చుట్టిన ట్రంప్​.. రెండో రోజు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య కీలకమైన ద్వైపాక్షిక చర్చలు, ఒప్పందాలు జరిగాయి. అనంతరం.. మంగళవారం రాత్రి 10.30 తర్వాత అమెరికాకు పయనమయ్యారు. ఈ పర్యటన పట్ల సంతోషం వ్యక్తం చేశారు డొనాల్డ్​. ఆతిథ్యంపై.. భారత ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.

Rashtrapati Bhavan in all its grandeur hosts the Trumps
వందనాలతో మొదలై.. విందుతో ముగిసె..!
author img

By

Published : Feb 26, 2020, 5:33 AM IST

Updated : Mar 2, 2020, 2:38 PM IST

అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ భారత పర్యటన స్నేహ సౌరభాలతో ముగిసింది. సోమవారం అహ్మదాబాద్​ విమానాశ్రయంలో అడుగిడినప్పటినుంచి రోడ్​ షో, సబర్మతీ ఆశ్రమ సందర్శన, మోటేరా స్టేడియంలో సభ, తాజ్​ సందర్శన ఆద్యంతం అట్టహాసంగా సాగింది.

మంగళవారం మాత్రం అధికారిక కార్యక్రమాలకు పరిమితమయ్యారు. ఊహించినట్లుగానే వాణిజ్య ఒప్పందం ఖరారు కాలేదు. రెండు దేశాల మధ్య సుమారు రూ. 21 వేల 500 కోట్ల విలువైన రక్షణ ఒప్పందం కుదిరింది.

ప్రధాని నరేంద్ర మోదీని సోమవారం గొప్ప నాయకుడిగా అభివర్ణించిన ట్రంప్​... రెండో రోజూ బలమైన నేత అని శ్లాఘించారు. ఉగ్రవాద అంతం మోదీ చూసుకోగలరని, పౌర సత్వ చట్టం భారత అంతర్గతమని స్పష్టం చేశారు. భారత్​ను మహత్తరమైన దేశంగా అభివర్ణించారు డొనాల్డ్​. రాష్ట్రపతి భవన్​లో విందు అనంతరం కుటుంబ సమేతంగా స్వదేశానికి తిరుగుపయనమయ్యారు ట్రంప్.

ఆతిథ్యం.. అద్భుతం..

రెండురోజుల భారత పర్యటనలో లభించిన ఆతిథ్యం, స్వాగత సత్కారాలు అద్వితీయమని కొనియాడారు అమెరికా అధ్యక్షుడు. భారత్‌తో రక్షణ, వ్యూహాత్మక బంధం బలోపేతమే లక్ష్యంగా వచ్చిన ట్రంప్‌.. ఈ రెండు రోజుల్లో లభించిన ఆతిథ్యంపై తన మనసు పులకించిపోయిందన్నారు. తనకు లభించిన అపూర్వ ఆతిథ్యం ఇంకెవరకీ లభించలేదని పొంగిపోయారు.

అహ్మదాబాద్‌లో దిగినప్పటి నుంచి రాష్ట్రపతి భవన్‌వరకు సాగిన మధుర పయనాన్ని మదిలో పదిలపరుచుకుంటానని చెప్పిన ట్రంప్‌ ఈ ఆతిథ్యంపై అమెరికన్లకు కూడా చెబుతానని వ్యాఖ్యానించారు.

విమానాశ్రయంలో ఘనస్వాగతం..

రెండో రోజుల భారత పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం అహ్మదాబాద్​ విమానాశ్రయంలో దిగారు ట్రంప్​. స్వయంగా ప్రధాని మోదీ వెళ్లి.. ట్రంప్​కు సాదరస్వాగతం పలికారు. అక్కడ డొనాల్డ్​ ​ దంపతులు, కుటుంబ సభ్యులు, అమెరికా ప్రతినిధి బృందం గొప్ప అనుభూతికి లోనైంది. గుజరాతీ సంప్రదాయ నృత్యాలు వారిని విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇదీ చూడండి: వేర్వేరు కార్లలో మోదీ-ట్రంప్​.. దారి పొడవునా ఘనస్వాగతం

అనంతరం రోడ్ ​షోగా సబర్మతీ ఆశ్రమానికి బయల్దేరారు. మార్గమధ్యంలోనూ ఏర్పాటు చేసిన విభిన్న కార్యక్రమాలు ట్రంప్​ను అలరించాయి. ఆశ్రమంలో లభించిన గౌరవం, అక్కడి వాతావరణంపైనా ప్రశంసలు కరిపించారు. సబర్మతి ఆశ్రమంలో గడిపిన 15 నిమిషాలు తనకు మధురానుభూతిని మిగిల్చిందన్నారు అమెరికా అధ్యక్షుడు.

trump
రాట్నం తిప్పుతున్న మెలానియా ట్రంప్​

ఇదీ చూడండి: 'గాంధీ' రాట్నం ఎలా తిప్పాలి?... తెలుసుకునేందుకు ట్రంప్​ ఆసక్తి

అక్కడ ఖాదీ రాట్నాన్ని చాలా ఆసక్తిగా గమనించిన ట్రంప్‌ దంపతులు కాసేపు రాట్నం కూడా తిప్పారు. ఇక్కడే మూడు కోతుల విశిష్టతను స్వయంగా ట్రంప్​కు తెలియజేశారు మోదీ. ఆ బొమ్మను బహుమతిగా అందజేశారు.

నమస్తే ట్రంప్​ కార్యక్రమం..

TRUMP
ప్రజలకు మోదీ అభివాదం

సబర్మతీ ఆశ్రమం నుంచి మళ్లీ రోడ్​ షోగా ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంలోకి అడుగుపెట్టారు. అక్కడ నిర్వహించిన నమస్తే ట్రంప్​ కార్యక్రమం విజయవంతమైంది. అశేష జనాన్ని చూసి ట్రంప్​ పొంగిపోయారు. పలుమార్లు ప్రశంసలు కురిపించారు.

TRUMP
తాజ్​మహల్​ ముందు ట్రంప్​ దంపతులు

అక్కడి నుంచి నేరుగా ఆగ్రా వెళ్లిన ట్రంప్​ దంపతులకు ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం అద్భుతంగా స్వాగతం పలికింది. అనంతరం తాజ్​ మహల్​ అందాలను తనివితీరా చూసి పులకించిపోయారు. వివిధ ప్రాంతాల్లో ఫొటోలకు ఫోజులిచ్చారు. ట్రంప్‌ కుమార్తె ఇవాంక ట్రంప్‌, అల్లుడు కుష్నర్‌ కూడా తాజ్‌ మహల్‌ వద్ద ఫొటోలు దిగారు.

trump
తాజ్​ ముందు ఇవాంకా ట్రంప్​-కుష్నర్​ జంట
TRUMP
తాజ్​ ముందు ట్రంప్​ దంపతులు

తాజ్​ సందర్శన అనంతరం.. దిల్లీకి వెళ్లారు. రాత్రి అక్కడే ఐటీసీ మౌర్య హోటల్లో బస చేశారు.

రెండో రోజు అధికారిక కార్యక్రమాల్లో...

భారత్ పర్యటనలో రెండో రోజున ట్రంప్‌ దంపతులకు రాష్ట్రపతి భవన్​లో అధికారిక స్వాగతం లభించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులు, ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులు.. డొనాల్డ్ ట్రంప్ దంపతులను ఆహ్వానించారు. ట్రంప్ కుమార్తె ఇవాంకా, అల్లుడు కుష్నర్‌, ఇతర శ్వేతసౌధం ప్రతినిధులు ముందుగానే అక్కడకు చేరుకున్నారు. తర్వాత ట్రంప్‌.. భారత సైనిక బలగాల గౌరవ వందనం స్వీకరించారు.

మహాత్ముడికి నివాళి..

రాష్ట్రపతి భవన్​ నుంచి ట్రంప్​ దంపతులు 'రాజ్​ఘాట్​'కు వెళ్లారు. భారత జాతిపిత మహాత్మ గాంధీకి పుష్పాంజలి ఘటించారు.

హైదరాబాద్​ హౌస్​లో ఒప్పందాలు..

రాజ్​ఘాట్​ నుంచి భారత్​-అమెరికా మధ్య కీలక ద్వైపాక్షిక చర్చలు కోసం హైదరాబాద్​ హౌస్​ చేరుకున్నారు ట్రంప్​. మోదీతో భేటీ అయ్యారు. రక్షణ, వాణిజ్యం, భద్రత, పెట్టుబడులు సహా పలు రంగాల్లోని కీలకాంశాలపై ఇరు దేశాధినేతలు సుదీర్ఘ చర్చలు జరిపారు. ఇరు దేశాల నడుమ దాదాపు రూ. 21 వేల 500 కోట్ల విలువైన రక్షణ ఒప్పందం కుదిరింది. తర్వాత మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు ట్రంప్​.

TRUMP
మోదీ-ట్రంప్​ పత్రికా ప్రకటన

ఇదీ చూడండి: భారత్​-అమెరికా మైత్రిలో నవశకం ఆరంభం

భారత్‌లో తనకు లభించిన ఆపూర్వ ఆతిథ్యం మరెవరికీ లభించలేదని పొంగిపోయారు. భారత ప్రజలు అమెరికాను గౌరవించేందుకే లక్షల్లో తరలివచ్చి తనకు స్వాగతం పలికారంటూ మీడియా సమావేశంలో ట్రంప్‌ తన మనసులోని మాటను పంచుకున్నారు.

విందుతో వీడ్కోలు...

రాత్రి 7.30 గంటలకు రాష్ట్రపతి ఇచ్చిన విందుకు హాజరయ్యారు ట్రంప్​ దంపతులు. వారికి సతీసమేతంగా ఆహ్వానం పలికారు కోవింద్​ దంపతులు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

అనంతరం రాత్రి 10.30 తర్వాత దిల్లీ విమానాశ్రయం నుంచి తన ఎయిర్​ఫోర్స్​ విమానంలో అమెరికాకు పయనమయ్యారు.

Last Updated : Mar 2, 2020, 2:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.