మన దేశంలో ఒక్కో ప్రాంతానికి ఒక్కో ఆచారం ఉంటుంది. ఈ తరహాలోనే కర్ణాటకలోని కరవాల్ తాలూకా మజాలి గ్రామంలో ఓ వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. ఏటా ఈ ప్రాంతంలో మార్కపునావ్ జాతర నిర్వహిస్తారు. ఈ వేడుకకు ఓ వైపు బాలురు, యువకులు సూదిని చేతిలో పట్టుకొని నడుస్తుంటే.. మరోవైపు యువతులు, మహిళలు తమ తలపై దీపాలు పెట్టుకొని అడుగులు వేస్తుంటారు. అనంతరం బాలురు, యువకుల బొడ్డును సూదితో కుట్టి.. ఆ దారాన్ని దైవానికి సమర్పించుకుంటారు. ఇలా చేయడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావనేది వారి నమ్మకం.
యువతులు,మహిళలు దీపాలను పట్టుకొని గ్రామంలోని డాడ్ ఆలయం నుంచి అమ్మవారి గుడి వరకు కాలినడకన నడుస్తారు. అనంతరం దేవతకు భక్తితో పూజలు చేస్తారు. గోవా, మహారాష్ట్ర, ముంబయి సహా ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు ఈ ఉత్సవానికి వస్తుంటారు.