అసోంలోని బిస్వనాథ్ చరియాలి జిల్లా సెషెన్స్ కోర్టు ఓ సంచలన తీర్పును ఇచ్చింది. అయిదేళ్ల బాలికపై హత్యాచారం చేసిన కేసులో దోషిగా తేలిన మంగల్ పైకేకు మరణశిక్షను ఖరారు చేస్తూ జడ్జి దీపాంక్ బోరా తీర్పు చెప్పారు.
2018లో డిక్రీ అటవీ ప్రాంతంలో మంగల్ ఓ చిన్నారిపై ఆత్యాచారానికి పాల్పడి.. హత్య చేశాడు. దీనిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.