లాక్డౌన్ నడుమ దేశవ్యాప్తంగా నేడు రంజాన్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ముస్లింలంతా ఆంక్షలను పాటిస్తూ.. ఇళ్ల వద్దే ప్రార్థనల్లో పాల్గొంటున్నారు.
మరోవైపు కేరళ, జమ్ము కశ్మీర్ల్లో ఆదివారమే ఈద్ వేడుకలు జరిగాయి. కరోనా వ్యాప్తిని నియంత్రించే క్రమంలో మతపరమైన సమావేశాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ క్రమంలోనే ఈద్ పర్వదినాన వేల సంఖ్యలో ముస్లింలు ప్రార్థనల్లో పాల్గొనే మసీదులు.. మొదటిసారి ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
ఉపరాష్ట్రపతి శుభాకాంక్షలు...
రంజాన్ పండుగ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ.. వేడుకలు జరుపుకోవాలని సూచించారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుభాంకాక్షలు తెలియజేస్తూ.. కరోనా నుంచి కాపాడుకునేందుకు అన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని సూచించారు.