రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లద్దాఖ్ పర్యటన వాయిదా పడింది. భారత్-చైనా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దులో భద్రత, సైనిక సన్నద్ధతను సమీక్షించేందుకు ఈనెల 3న (శుక్రవారం) మంత్రి లద్దాఖ్ వెళ్లాల్సి ఉంది.
భారత్-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల ప్రాంతంలో సైనిక సన్నద్ధతను సమీక్షించేందుకు రాజ్‌నాథ్ త్వరలోనే పర్యటిస్తారు. ఆయనతో పాటు సైన్యాధిపతి ఎంఎం నరవాణే వెళ్లనున్నారు.
- అధికార వర్గాలు
దాదాపు రెండు నెలలుగా భారత్-చైనా మధ్య తూర్పు లద్దాఖ్‌లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 23, 24న సైన్యాధిపతి ఎంఎం నరవాణే లద్దాఖ్‌లో పర్యటించారు. సీనియర్ సైనికాధికారులతో సమావేశమై పరిస్థితులను తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం లద్దాఖ్‌లో పర్యటిస్తారని ప్రకటించినా.. వాయిదా పడింది.
ఇదీ చూడండి: టార్గెట్ చైనా: భారత అమ్ముల పొదిలోకి మరిన్ని అస్త్రాలు