ETV Bharat / bharat

'సైనికుల త్యాగాలను దేశం ఎన్నటికీ మరవదు' - రాజ్​నాథ్​

రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ సియాచిన్​లో పర్యటించారు​. అమర జవాన్లకు నివాళులర్పించారు. సియాచిన్​లోని ప్రమాదకర పరిస్థితుల్లోనూ సైనికులు ఎంతో ధైర్యంతో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని కొనియాడారు. సైనికుల త్యాగాలను దేశం ఎన్నటికీ మరవదని పేర్కొన్నారు.

సైనికుల త్యాగాలను దేశం ఎన్నటికీ మరవదు: రాజ్​నాథ్​
author img

By

Published : Jun 3, 2019, 5:03 PM IST

Updated : Jun 3, 2019, 5:58 PM IST

'సైనికుల త్యాగాలను దేశం ఎన్నటికీ మరవదు'

రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి ప్రపంచంలోనే ఎత్తయిన సైనిక స్థావరం సియాచిన్​ను సందర్శించారు రాజ్​నాథ్​ సింగ్​. అక్కడి భద్రతా పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సియాచిన్ మంచు పర్వతం వద్దకు వెళ్లి అక్కడి ఫీల్డ్​ కమాండర్లు, సైనికులతో మాట్లాడారు. వారితో కలిసి అల్పాహారం చేశారు.

అనంతరం అమర జవాన్లకు నివాళులర్పించారు రక్షణ మంత్రి​. ప్రమాదకర భూభాగంలో తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ సైనికులు ఎంతో ధైర్యంతో దేశ భద్రతకై పాటుపడుతున్నారని కొనియాడారు. వారి ధైర్యసాహసాలకు వందనం చేస్తున్నానన్నారు. దేశ రక్షణ కోసం సియాచిన్​ గ్లేసియర్​లో 1100 మంది సైనికులు ప్రాణాలొదిలారని తెలిపారు. సైనికుల త్యాగాలను దేశం ఎన్నటికీ మరవదని పేర్కొన్నారు.

ఆయన వెంట సైన్యాధిపతి బిపిన్​ రావత్​, ఇతర రక్షణ శాఖ అధికారులు హాజరయ్యారు.

శ్వాస తీసుకోవడానికి సైతం కష్టంగా ఉండే ప్రాంతం సియాచిన్​. 23 వేల అడుగుల ఎత్తయిన ప్రదేశంలో భారత సైన్యం సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసి, అక్కడ సైనికులను మోహరించింది.

ఇదీ చూడండి: 13 మందితో భారత యుద్ధ విమానం గల్లంతు

Intro:Body:

asas

Conclusion:
Last Updated : Jun 3, 2019, 5:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.