రాజ్‌నాథ్ సింగ్.. నేడు కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. పదవీ బాధ్యతలు చేపట్టేముందు దిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన జవాన్లకు నివాళులర్పించారు.
త్రివిధ దళాధిపతులు బిపిన్ రావత్, బీఎస్ ధనోవా, కరమ్బిర్ సింగ్‌లు రాజ్‌నాథ్ వెంట ఉన్నారు.
నరేంద్ర మోదీ హయాంలో తొలిసారి రక్షణ శాఖ మంత్రిగా పనిచేయనున్నారు రాజ్‌నాథ్ సింగ్. మొదటి దఫా మోదీ ప్రభుత్వంలో హోం శాఖ బాధ్యతలు నిర్వర్తించారు రాజ్‌నాథ్. ఈ సారి అమిత్ షాకు హోం మంత్రి పదవి దక్కింది.
దిల్లీ ఇండియా గేట్ సమీపంలో నెలకొల్పిన జాతీయ యుద్ధ స్మారకాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 24న ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు.