నృత్యం... మన మనసులను రంజింపచేసే ఓ అద్భుత కళ. భూమిపై అద్భుతంగా నృత్యం చేసి మనల్ని అలరించే ఎంతో మందిని చూస్తుంటాం. కానీ ఓ కళాకారుడు మాత్రం నీటి అడుగున సుమారు 2 నిమిషాలకు పైగా ఊపిరి బిగపట్టి నృత్యం చేస్తూ ఔరా అనిపిస్తున్నాడు. అందరిచేత శభాష్ అనిపించుకుంటున్నాడు. అతనే 'హైడ్రోమాన్' జయదీప్ గోహెల్.
గుజరాత్ రాజ్‌కోట్‌కు చెందిన జయదీప్ గోహెల్కు చిన్నప్పటి నుంచి నృత్యంపై ప్రత్యేక ఆసక్తి. అయితే అందరి కంటే భిన్నంగా ప్రయత్నించాలని అతను కోరుకున్నాడు. అందు కోసం ఇంట్లోనే సొంతంగా ఓ గాజు (బాక్స్) తొట్టె నిర్మించుకున్నాడు. అందులోనే నృత్యాన్ని అభ్యసించి, అద్భుత నైపుణ్యం సాధించాడు. దేశ, విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాడు. అభిమానుల చేత 'హైడ్రోమాన్'గా గుర్తింపు పొందాడు.
బాలీవుడ్‌లోనూ... ప్రతిభ చాటాడు...
జయదీప్ 2015లో నిర్వహించిన 'ఇండియా గాట్ టాలెంట్'లో హిందీ నటుడు అక్షయ్‌కుమార్‌తో కలిసి నృత్యం చేశాడు. పాటలకు అనుగుణంగా నీటి అడుగున అద్భుత నృత్యాలు చేస్తూనే ఉన్నాడు. అతనికి సామాజిక మాధ్యమాల్లోనూ ఎంతో మంది అభిమానులున్నారు.
ఇదీ చూడండి: జమ్ముకశ్మీర్ రిజర్వేషన్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం