ETV Bharat / bharat

కరోనా విజృంభణతో ఆ రాష్ట్ర సరిహద్దుల మూసివేత

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దులను మూసివేసింది రాజస్థాన్​. రాష్ట్రంలోకి రావాలంటే తప్పనిసరిగా పాసులు ఉండాలని పేర్కొంది. సరిహద్దుల వద్ద తక్షణమే తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించింది.

Rajasthan seals borders
కరోనా విజృంభణతో ఆ రాష్ట్ర సరిహద్దుల మూసివేత!
author img

By

Published : Jun 10, 2020, 1:05 PM IST

లాక్​డౌన్​ ఆంక్షలు సడలిస్తున్న క్రమంలో ఇప్పుడిప్పుడే ఆర్థిక కార్యకలాపాలు, ప్రయాణాలు ప్రారంభమవుతున్నాయి. మరోవైపు కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వైరస్​ కట్టడికి అంతర్రాష్ట్ర ప్రయాణాలపై మళ్లీ ఆంక్షలు విధించింది రాజస్థాన్​. రాష్ట్ర సరిహద్దులు మూసివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

''రాష్ట్రంలోకి వచ్చే, బయటకి వెళ్లే వారిపై నియంత్రణ ఉంటుంది. సంబంధిత అధికారుల నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్​ఓసీ) లేకుండా రాజస్థాన్​లోకి ఎవరూ ప్రవేశించలేరు. పాస్​ లేకుండా రాష్ట్రం నుంచి బయటకి వెళ్లలేరు. సరిహద్దుల్లో తక్షణమే తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఐజీలు, ఎస్పీలు, కమిషనర్లు, ఉప కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశాం. ఏడు రోజుల పాటు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి.''

- ఎం.ఎల్​ లాతూర్​, డీజీపీ (శాంతిభద్రతలు)

సరిహద్దులతో పాటు రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాల్లో చెక్​పోస్టులు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు లాతూర్​. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు మాత్రమే పాసులు ఇస్తారని, ఆస్పత్రిలో చేరడం వంటి అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే మినహాయింపు ఉంటుందని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: వలస కూలీల దినసరి వేతనం 'కనీస కూలీ' కన్నా తక్కువే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.