ప్రధాన రహదారిపై అనూహ్యంగా ఏర్పడిన గుంతలో ఓ ఆటో పడి ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటన రాజస్థాన్ జైపుర్‌లోని అశోక్‌నగర్‌లో జరిగింది.
పైప్‌లైన్ లీకేజీ కారణంగానే ఈ 20 అడుగుల గుంత ఏర్పడినట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఘటనాస్థలానికి చేరుకున్న అత్యవసర సేవా బృందం.. ఆటోడ్రైవర్‌ను, ఇద్దరు ప్రయాణికులను స్థానిక ఎస్ఎమ్ఎస్ ఆసుపత్రిలో చేర్చింది. ప్రస్తుతం ఆటోడ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరి తగిన చర్యలు చేపట్టారు. ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ను మళ్లించారు.
ఇలా రోడ్డుకు గుంతలు ఏర్పడుతున్న ఘటనలు ఈ మధ్యకాలంలో జైపుర్‌లో తరచూ కనపడుతుండటం ప్రజల్లో ఆందోళనను పెంచుతోంది.
ఇదీ చదవండి:దేశంలో 150కి చేరిన యూకే వైరస్ బాధితులు