కదులుతున్న రైల్లో మంటలు చెలరేగిన ఘటన ఒడిశాలోని బాలేశ్వేర్, సోరో రైల్వే స్టేషన్ల మధ్య కంటాపదకు సమీపంలో జరిగింది. దిల్లీ నుంచి భువనేశ్వర్ వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌లోని జనరేటర్ బోగిలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ప్రయాణికులెవరికీ ప్రమాదం జరగకుండా కాపాడినట్లు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 12.50 నుంచి 1 గంట మధ్య ఈ ప్రమాదం సంభవించినట్లు చెప్పారు.
మంటలను ఆర్పేందుకు మూడు అగ్నిమాపక వాహనాల్ని ఉపయోగించారు. బోగీని రైలు నుంచి వేరు చేసి, ట్రాక్‌పైనున్న విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.
కంటాపద నుంచి మరో జనరేటర్ బోగి సహాయంతో రైలు భువనేశ్వర్‌కు బయలుదేరిందని సమాచారం.
ఇదీ చూడండి: ఒకే రోజు 2 స్పైస్‌జెట్ విమానాలకు ముప్పు!