బంగాల్ గవర్నర్ జగదీప్ ధనఖర్ సంచలన ఆరోపణలు చేశారు. గవర్నర్ అధికారిక నివాస భవనం రాజ్‌భవన్‌పై నిఘా ఉంచారని ఆరోపించారు. రాజ్‌భవన్ పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని.. కానీ తాను అలా కాకుండా సంరక్షిస్తానని వ్యాఖ్యానించారు.
''నేను మీకు చెప్పేది ఒకటే.. రాజ్‌భవన్ నిఘాలో ఉంది. ఇది రాజ్‌భవన్ పవిత్రతను దెబ్బతీస్తోంది. దాన్ని కాపాడేందుకు నేను ఏదైనా చేస్తా.''
- జగదీప్ ధనఖర్
మమతా బెనర్జీ ప్రభుత్వంతో చాలా కాలంగా మాటల యుద్ధం నేపథ్యంలో గవర్నర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎన్నో అంశాల్లో దీదీ, గవర్నర్ పరస్పరం విమర్శించుకుంటూ వస్తున్నారు.