ETV Bharat / bharat

రాగల నాలుగు రోజుల్లో భారీ వర్షాలు! - october rains

రానున్న నాలుగు రోజుల్లో దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది భారత వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనమే ఇందుకు కారణమని పేర్కొంది.

rainfall-with-thunderstorm-likely-over-odisha-jharkhand-gangetic-west-bengal-between-oct-2-6-imd
రాగల నాలుగు రోజులు భారీ వర్షాలు!
author img

By

Published : Oct 2, 2020, 10:05 PM IST

దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వెల్లడించింది భారత వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వచ్చే 3-4 రోజుల్లో ఎడతెరపి లేకుండా వానలు కురిసే సూచనలున్నాయని తెలిపింది. ఒడిశా, ఝార్ఖండ్, బంగాల్ రాష్ట్రాల్లో ఈ అల్పపీడన ప్రభావం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది.

"ఝార్ఖండ్, ఒడిశా, బంగాల్ రాష్ట్రాల్లో దాదాపు నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ తీరాన ఒడిశా ఉత్తరాన, బంగాల్​కు వాయువ్యంగా ఏర్పడిన అల్పపీడనం కారణంగా అక్టోబర్ 2-6 తేదీల్లో.. కుండపోత వర్షాలు కురిసే సూచనలున్నాయి."

- భారత వాతావరణ శాఖ

మేఘాలయ, త్రిపుర, అసోం రాష్ట్రాల్లోనూ వర్షాలు కురుస్తాయని వెల్లడించిన వాతావరణశాఖ.. వాయువ్య భారతంలో చాలా చోట్ల పొడి వాతావరణం నెలకొనే అవకాశముందని తెలిపింది..

ఇదీ చదవండి: ఆశాజనకంగా ఆస్ట్రాజెనెకా ఫలితాలు!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.