ETV Bharat / bharat

పట్టాలెక్కనున్న మరిన్ని రైళ్లు.. వెయిటింగ్​ లిస్ట్​ అందుబాటులోకి!

భారతీయ రైల్వే క్రమంగా రైళ్ల సంఖ్యను పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నడుస్తున్న రైళ్లతో సహా త్వరలో ప్రారంభించే సర్వీసులకు.. మే 22 నుంచి వెయిటింగ్​ లిస్ట్ సదుపాయం అందుబాటులోకి తీసుకురానుంది. అయితే కొంతమందికే వెయిటింగ్​ లిస్టులో చోటు దక్కనుంది.

Railways
రైల్వే
author img

By

Published : May 14, 2020, 5:31 AM IST

భారతీయ రైల్వే... ఎక్స్​ప్రెస్, మెయిల్ రైళ్లను మరిన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. తాజాగా వెయిటింగ్​ లిస్ట్​కు సంబంధించిన మార్గదర్శకాలనూ జారీ చేసింది. ప్రస్తుతం నడుస్తున్న రైలు సేవలతో సహా త్వరలో పునః ప్రారంభించే మార్గాల్లో మే 22 నుంచి వెయిటింగ్​ లిస్ట్ అందుబాటులోకి తెస్తున్నట్లు పేర్కొంది.

అయితే వెయిటింగ్​ జాబితాలో కొద్ది మందికే చోటు దక్కనుంది. ఏసీ 3 టైర్​లో 100, ఏసీ 2 టైర్​లో 50, స్లీపర్​ క్లాస్​లో 200, ఛైర్​ కార్​లో 100, ఫస్ట్​, ఎక్జిక్యూటివ్ తరగతులలో వెయిటింగ్ లిస్ట్ సంఖ్యను 20కి పరిమితం చేసింది.

మే 22 తర్వాత చేసే ప్రయాణాలు, మే 15 తర్వాత చేసుకున్న బుకింగ్​లకు కొత్త విధానం వర్తిస్తుందని రైల్వే తెలిపింది. పూర్తి ఎయిర్​కండిషనర్​ రైళ్లకు బదులు మిక్స్​డ్ సర్వీసులను నడిపే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొంది.

నగరాలతో పాటు చిన్న పట్టణాలకు సైతం సర్వీసులు ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మరిన్ని రైలు సేవల పునరుద్ధరణ అంశంపై రైల్వే అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.