2021 మార్చి కల్లా 7వేల ప్రయాణికుల రైల్ కోచ్‌ల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని రైల్వే మంత్రి పీయూష్ గోయెల్ తెలిపారు. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఈ విషయాన్ని ప్రకటించారు మంత్రి.
"ప్రీమియం, మెయిల్, ఎక్స్‌ప్రెస్, సబర్బన్ రైళ్లలో ఇప్పటికే సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. ప్రధాన పాసెంజర్ రైళ్లలోని 1,300 కోచ్ల్లోనూ అమర్చాం. ప్రస్తుతం మొదటి దశలో భాగంగా 2021 మార్చ్ కల్లా 7,020 కోచ్‌ల్లో సీసీ టీవీలను ఏర్పాటు చేస్తాం. మిగతా కోచ్‌లను ఆ తర్వాత దశలో పూర్తి చేస్తాం."
-పీయూష్ గోయెల్, రైల్వే మంత్రి
ఇదీ చూడండి: కిరణ్ బేడీ ట్వీట్‌పై లోక్‌సభలో గందరగోళం