ETV Bharat / bharat

భోపాల్ రైల్వేస్టేషన్​లో కూలిన పాదచారుల వంతెన - భోపాల్ రైల్వే వంతెన

మధ్యప్రదేశ్​ భోపాల్​ రైల్వేస్టేషన్​లోని పాదచారుల వంతెన కూలిపోయింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

rail-overbridge-collapses-at-bhopal-station-5-6-people-injured
భోపాల్ రైల్వే స్టేషన్​లో కూలిపోయిన పాదాచారుల వంతెన
author img

By

Published : Feb 13, 2020, 11:17 AM IST

Updated : Mar 1, 2020, 4:51 AM IST

భోపాల్ రైల్వేస్టేషన్​లో కూలిన పాదచారుల వంతెన

మధ్యప్రదేశ్​ రాజధాని భోపాల్​ రైల్వేస్టేషన్​లోని రెండో నెంబర్​ ప్లాట్​ఫాం వద్ద ఉన్న పాదచారుల వంతెనలోని ఓ భాగం కూలిపోయింది. ఈ ఘటనలో ఎనిమిదిమందికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదంలో 10 మందికి పైగా గాయపడ్డట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

పాదచారుల వంతెన కూలడం వల్ల వచ్చే రైళ్లను ఇతర ప్లాట్​ఫాంల పైకి మళ్లిస్తున్నారు. వంతెన పరిస్థితి బాగా లేదని స్టేషన్ మాస్టార్​కు ఇదివరకే ఫిర్యాదులు అందాయని.. అయినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

Last Updated : Mar 1, 2020, 4:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.