మాజీ కేంద్రమంత్రి పి.చిదంబరాన్ని కలిసేందుకు కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఇవాళ తిహార్ జైలుకు వెళ్లారు.
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మాజీ ఆర్థికమంత్రి చిదంబరాన్ని ఆగస్టు 21న సీబీఐ అరెస్టు చేసింది. అయితే అక్టోబర్ 22న ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
తిహార్‌కు
అక్రమ నగదు చలామణి కేసులో చిదంబరాన్ని అక్టోబర్ 16న అదుపులోకి తీసుకుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ట్రయల్ కోర్టు.. ఆయనను నవంబర్ 27 వరకు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చూడండి: కాసేపట్లో నింగిలోకి పీఎస్ఎల్వీ-సి47