జాతీయ మానవ హక్కుల కమిషన్ అధికారుల్ని రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ నేతల బృందం కలిసింది. సీఏఏకు వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్లో జరిగిన ఆందోళనలలో పోలీసులు మానన హక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్లు ఫిర్యాదు చేసింది. 'పోలీసుల అరాచకాల'పై ఆధారాలను 31 పేజీల నివేదిక రూపంలో ఎన్హెచ్ఆర్సీకి సమర్పించింది.
పోలీసుల అకృత్యాలపై, ఆందోళనలలో జరిగిన మరణాలపై పూర్తి స్థాయి విచారణ జరపాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. అల్లర్లలో బాధితులను నిందితులుగా పేర్కొన్నారు గానీ మానవహక్కులను ఉల్లంఘించిన ఏ ఒక్క పోలీసు అధికారుల పేర్లను ఎఫ్ఐఆర్లో నమోదు చేయలేదని నివేదించారు.
ఇదీ చూడండి: ఆవు కోసం పులితో పోరాడి ప్రాణాలు కోల్పోయిన యువకుడు