రాబర్ట్ వాద్రాతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ కూడా భూ అక్రమాలకు పాల్పడ్డారని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. ఇందుకు సంబంధించి మీడియాలో ప్రచురితమైన ఓ కథనాన్ని చూపించారు. ఈ 'కుటుంబ అవినీతికి' హస్తం పార్టీ ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు.
రాహుల్ గాంధీ ఓ భూమిని కొన్నారు. ఈ వ్యవహారంలో హెచ్.ఎల్ పహవా పాత్ర ఉంది. ఆయనను ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రశ్నించింది. వాద్రా భూ కొనుగోలు వ్యవహారంలో మహేశ్కూమార్ నగర్ పాత్ర కూడా ఉంది. ఆయుధ దళారీ సంజయ్ భండారీ, వాద్రా స్నేహితుడైన సీసీ థంపీ ఈ భూ కొనుగోలుకు నిధులు సమకూర్చారు. యూపీఏ హయాంలో జరిగిన రక్షణ, పెట్రోలియం కొనుగోళ్లలో థంపీ, భండారీలు క్రియాశీలకంగా వ్యవహరించారు.
- స్మృతి ఇరానీ, కేంద్రమంత్రి
స్మృతి ఇరానీ ఆరోపణలకు కాంగ్రెస్ స్పందించింది. కేంద్రమంత్రి చేస్తున్నవన్నీ నిరాధార ఆరోపణలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ఖండించారు.
ఈ వ్యవహారంలో అవినీతి జరిగిందని తెలిసినప్పుడు గత ఐదేళ్లలో భాజపా ప్రభుత్వం ఎందుకు విచారణ చేపట్టలేదు. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని భాజపా గ్రహించింది. అందుకే ప్రధానితో పాటు ఆ పార్టీ నేతలందరూ రాహుల్ కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.
-రణ్‌దీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి