దేశ రక్షణలో, పాకిస్థాన్ దుశ్చర్యలను తిప్పికొట్టడంలో భద్రత దళాలు ప్రదర్శించిన ధైర్య సాహసాలపై ప్రశంసలు కురిపించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. పండుగ సమయంలోనూ కుటుంబానికి దూరంగా ఉంటూ దేశాన్ని రక్షిస్తున్నారని పేర్కొన్నారు.
జమ్ముకశ్మీర్‌లోని గురేజ్ నుంచి ఉరీ సెక్టార్ వరకు నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ శుక్రవారం కాల్పులకు పాల్పడగా.. దాయాదికి భద్రత దళాలు దీటుగా జవాబు ఇచ్చాయి. ఈ క్రమంలో ట్వీట్ చేశారు రాహుల్.
-
पाकिस्तान जब भी सीज़फ़ायर का उल्लंघन करता है, उसका डर व कमज़ोरी और भी साफ़ हो जाते हैं।
— Rahul Gandhi (@RahulGandhi) November 13, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
त्योहार पर भी अपने परिवारों से दूर, भारतीय सेना के जवान हमारे देश की सुरक्षा में डटे हैं और पाकिस्तान के घृणित मंसूबों को ध्वस्त कर रहे हैं।
सेना के हर जवान को मेरा सलाम।
">पाकिस्तान जब भी सीज़फ़ायर का उल्लंघन करता है, उसका डर व कमज़ोरी और भी साफ़ हो जाते हैं।
— Rahul Gandhi (@RahulGandhi) November 13, 2020
त्योहार पर भी अपने परिवारों से दूर, भारतीय सेना के जवान हमारे देश की सुरक्षा में डटे हैं और पाकिस्तान के घृणित मंसूबों को ध्वस्त कर रहे हैं।
सेना के हर जवान को मेरा सलाम।पाकिस्तान जब भी सीज़फ़ायर का उल्लंघन करता है, उसका डर व कमज़ोरी और भी साफ़ हो जाते हैं।
— Rahul Gandhi (@RahulGandhi) November 13, 2020
त्योहार पर भी अपने परिवारों से दूर, भारतीय सेना के जवान हमारे देश की सुरक्षा में डटे हैं और पाकिस्तान के घृणित मंसूबों को ध्वस्त कर रहे हैं।
सेना के हर जवान को मेरा सलाम।
"పాకిస్థాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడినప్పుడల్లా, దాని భయాలు, బలహీనతలు స్పష్టంగా కనిపిస్తాయి. ప్రస్తుత పండుగ సమయంలోనూ కుటుంబాలకు దూరంగా ఉండి భారత సైనికులు మన దేశాన్ని కాపాడుతున్నారు. అలాగే పాకిస్థాన్ కపట ప్రణాళికలను తిప్పికొడుతున్నారు. ఆర్మీలోని ప్రతి సైనికుడికి నా వందనం. "
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
దేశవ్యాప్తంగా దీపావళి జరుపుకుంటున్న క్రమంలో దాయాది పాకిస్థాన్ తన కపట బద్ధిని ప్రదర్శించింది. జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి పలు సెక్టార్లలో శుక్రవారం మోర్టార్లు, తుపాకులతో కాల్పులకు పాల్పడ్డారు పాక్ సైనికులు.
ఇదీ చూడండి: పాకిస్థాన్ కాల్పులు- ఎస్సై సహా ముగ్గురు జవాన్లు వీరమరణం