ETV Bharat / bharat

'గళం విప్పితే కోర్టు కేసులతో వేధింపులు' - bihar

దేశంలో ఆర్​ఎస్​ఎస్ సిద్ధాంతాలకు, ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వ్యతిరేకంగా గళం విప్పిన వారు కోర్టు కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. బిహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్​కుమార్​ మోదీ వేసిన పరువునష్టం కేసు విచారణ సందర్భంగా పట్నా కోర్టులో హాజరయ్యారు రాహుల్. ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

'గళం విప్పితే కోర్టు కేసులతో వేధింపులు'
author img

By

Published : Jul 6, 2019, 5:09 PM IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీ, భాజపా, ఆర్​ఎస్​ఎస్​పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఆర్​ఎస్​ఎస్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మాట్లాడితే కోర్టు కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు దేశంలో నెలకొని ఉన్నాయన్నారు.

బిహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ దాఖలు చేసిన పరువు నష్టం కేసు విచారణ సందర్భంగా పట్నా కోర్టుకు హాజరయ్యారు రాహుల్. ఈ కేసులో ఆయనకు ఊరట లభించింది. రాహుల్​కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

'గళం విప్పితే కోర్టు కేసులతో వేధింపులు'

"ఆర్​ఎస్ఎస్ సిద్ధాంతాలకు, మోదీ భావజాలానికి వ్యతిరేకంగా నిల్చున్నవారు దాడి, కోర్టు కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రాజ్యాంగాన్ని రక్షించేందుకు, పేద ప్రజల పక్షాన గళం విప్పేందుకు, రైతులకు బాసటగా నిలిచేందుకే పోరాటం చేస్తున్నాను. ఈ కారణంగానే నేను ఇక్కడికి వచ్చాను. కొంతమంది వ్యక్తులను రక్షించేందుకు దేశం కోసం పోరాడే వారిక గొంతు నొక్కుతున్నారు. నా పోరాటం కొనసాగిస్తాను."

-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత

కోర్టు వద్ద నిరసనలు...

పట్నా న్యాయస్థానం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా చేశారు. పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్​ రాజీనామా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

వరుసగా న్యాయస్థానాలకు హాజరు...

ఆర్​ఎస్​ఎస్​కు చెందిన ఓ కార్యకర్త దాఖలు చేసిన పరువునష్టం కేసుపై శుక్రవారం ముంబయి కోర్టుకు హాజరయ్యారు రాహుల్. శనివారం పట్నా కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసు తదుపరి విచారణ ఆగస్టు 8న జరగనుంది.

ఇదీ చూడండి: పరువు నష్టం కేసులతో రాహుల్​ బిజీబిజీ

New Delhi, July 06 (ANI): Defence Minister Rajnath Singh paid tribute to former Union Minister Syama Prasad Mukherjee on his birth anniversary on Saturday. BJP leaders Harsh Vardhan and Subramanian Swamy were also present at Central Hall, Parliament to pay tribute. Syama Prasad Mukherjee was founder of Bharatiya Jan Sangh. Mukherjee served as Minister for Industry and Supply in Prime Minister Jawaharlal Nehru's cabinet.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.