బిహార్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇప్పటికే భాజపా, కాంగ్రెస్.. తమ పార్టీల ప్రచారం కోసం స్టార్ క్యాంపెయినర్స్లను ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ..3 విడతల్లోనూ ప్రచారం నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు ఆ పార్టీ బిహార్ ఇంఛార్జి శక్తిసింగ్ గోహిల్. కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ బుధవారం సమావేశమైన అనంతరం ఆయన పలు కీలక విషయాలు వెల్లడించారు.
''రాహుల్ గాంధీ.. 3 విడతల కోసం ప్రచారం చేస్తారు. ఎక్కడ, ఎప్పుడు ప్రచారం నిర్వహిస్తారో.. త్వరలో ప్రకటిస్తాం.''
- శక్తిసింగ్ గోహిల్, బిహార్ కాంగ్రెస్ ఇంఛార్జి
ప్రచార వ్యూహాల కోసం.. మహాకూటమిలోని మిత్రపక్షాలతో కాంగ్రెస్ గురువారం చర్చలు జరపనున్నట్లు గోహిల్ తెలిపారు. సీఈసీ భేటీకి పార్టీ సీనియర్లు కేసీ వేణుగోపాల్, ఏకే ఆంథోనీ, అవినాశ్ పాండే, మదన్ మోహన్ ఝా, దేవేంద్ర యాదవ్, అజయ్ కపూర్, వీరేందర్ సింగ్ రాఠోడ్ తదితరులు హాజరయ్యారు.
ఇదీ చూడండి: బిహార్ బరి: భాజపా అభ్యర్థుల లెక్కలు తేలాయ్..
243 స్థానాలున్న బిహార్ శాసనసభకు మొత్తం 3 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశ పోలింగ్ అక్టోబర్ 28న నిర్వహించనున్నారు. నవంబర్ 3 రెండో, 7న మూడో విడత ఎన్నికలు జరుగుతాయి. నవంబర్ 10న ఫలితాలు ప్రకటించనున్నారు.
ఇదీ చూడండి: బిహార్ బరి: బడా నేతలు, భారీ ప్రచారాలు మిస్!