ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యంగా మరోమారు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ. భారత్‌ను చైనా బలగాలు ఆక్రమిస్తుంటే 56 అంగుళాల ఛాతి గల వ్యక్తి కనీసం డ్రాగన్ పేరును కూడా ప్రస్తావించలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. రైతులు, కార్మికులు, చేనేత కార్మికులతోనే భారత్ బలపడుతుందని అన్నారు.
ఈ మూడు వర్గాలకు బలం చేకూరిస్తే చైనాతో ఉన్న దేశ సరిహద్దులను జవాన్లు కాపలా ఉండాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. తమిళనాడులోని త్రిపుర, ఈరోడ్లలో ఆదివారం నిర్వహించిన ప్రచార కార్యక్రమాల్లో ఈ వ్యాఖ్యలు చేశారు రాహుల్. తొలిసారిగా.. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకోవడం దేశ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.
"తమిళ సంస్కృతిని నేను స్వాగతించడమే కాదు గౌరవిస్తాను కూడా. ప్రధాని, భాజపాలు తమిళులను కించపరిస్తే చూస్తూ ఊరుకోను. భిన్న సంస్కృతులు ఉండటం భారత్‌కు బలం. దేశంలోని ప్రతి భాషను, సంస్కృతిని, మతాన్ని కాపాడుకోవడం మన బాధ్యత."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
మోదీ దేశంలోని ఐదు లేదా ఆరుగురు వ్యాపారవేత్తల కోసం మాత్రమే పరిపాలిస్తున్నారని పునరుద్ఘాటించారు.
ఇదీ చదవండి : గణతంత్ర దినోత్సవంలో సంజ్ఞల భాష శకటం