ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో దేశాన్ని కాపాడే జవాన్ల బాగోగులను కేంద్రం పట్టించుకోలేదని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. అన్ని రంగాలనూ బడ్జెట్ పూర్తిగా నిరాశపరిచిందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ కొందరు వ్యాపారవేత్తల ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని రాహుల్ ధ్వజమెత్తారు.
మోదీ ప్రవేశపెట్టిన పెట్టుబడిదారుల (క్రోనీ సెంట్రిక్)బడ్జెట్‌తో జవాన్లకు ఒరిగేదేమీ లేదు. భారత్‌ని అనునిత్యం కాపాడే సైనికులకు కేంద్రం ద్రోహం చేసింది. జవాన్ల సంక్షేమానికి నిధుల కేటాయింపు ఆశాజనకంగా లేదు.
-రాహుల్‌గాంధీ ట్వీట్
ఆర్థికంగా తీవ్ర నష్టాల్లో ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు(ఎంఎస్ఎంఈ) తక్కువ వడ్డీ రుణాల ఊసేలేదని రాహుల్ మండిపపడ్డారు.
ఇదీ చదవండి: బడ్జెట్‌తో 99% మందికి అన్యాయం: రాహుల్