ETV Bharat / bharat

సీనియర్లపై రాహుల్ వ్యాఖ్యలతో కాంగ్రెస్​లో దుమారం! - కాంగ్రెస్​ తాజా వార్తలు

సీనియర్ నేతలు రాసిన లేఖపై సీడబ్ల్యూసీలో వాడీవేడీ చర్చ జరిగింది. సమయం, సందర్భంగా లేకుండా అధినాయకత్వాన్ని ప్రశ్నిస్తూ లేఖ ఎలా రాస్తారని అగ్రనేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపాతో కుమ్మక్కై ఈ పనికి పాల్పడ్డారా అని రాహుల్ ప్రశ్నించినట్లు వార్తలొచ్చాయి. దీనిపై మొదట సీనియర్ నేతలు కపిల్ సిబల్, గులాం నబీ ఆజాద్​ అసంతృప్తి వ్యక్తం చేసినా.. రాహుల్​ అలాంటి వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు.

CWC-RAHUL
రాహుల్
author img

By

Published : Aug 24, 2020, 6:31 PM IST

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి సీనియర్ నేతలు రాసిన లేఖ వర్కింగ్ కమిటీ సమావేశంలో తీవ్ర చర్చకు దారితీసింది. సీడబ్ల్యూసీ భేటీలో పార్టీ పరిస్థితిపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని రాసిన లేఖ బయటకు రావటం పెద్ద దుమారం లేపింది. దీనిపై స్పందించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ... సోనియా ఆసుపత్రిలో ఉన్న సమయంలో లేఖ రాయటం ఏంటని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లేఖ రాయటం వెనుక నేతల ఉద్దేశాలపై రాహుల్ వ్యాఖ్యానించినట్లు వార్తలు రావటం కాంగ్రెస్​లో అంతర్గత దుమారానికి దారితీసింది.

"సోనియా గాంధీ ఆసుపత్రిలో ఉన్నప్పుడు సమయం, సందర్భం లేకుండా లేఖలు ఎలా రాస్తారు? రాజస్థాన్​ సంక్షోభ సమయంలో నాయకత్వంపై విమర్శలు చేస్తూ లేఖలు భావ్యమా? ఇది భాజపాకు అనుకూలంగా మారే అవకాశం లేదా? అసలు పార్టీ అంతర్గత వ్యవహారాలు బయటకు ఎలా వెళ్తున్నాయి? బహిరంగంగా ఎందుకు చర్చిస్తున్నారు?" అని సీడబ్ల్యూసీ భేటీలో రాహుల్ ప్రశ్నించినట్లు సమాచారం.

"ఈ క్రమంలోనే సీనియర్లు లేఖ రాయటం వెనుక ఉద్దేశాలపై తీవ్రంగా ప్రశ్నించారు. భాజపాతో కుమ్మక్కై ఈ పనికి పాల్పడ్డారా? అని నిలదీశారు. ఆ లేఖ తన తల్లిని తీవ్రంగా బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను రాజీనామా చేశాక అధ్యక్ష బాధ్యతపై సోనియా విముఖత వ్యక్తం చేశారని గుర్తుచేశారు. సీడబ్ల్యూసీ సభ్యుల ప్రోద్బలంతో ఆమె అధ్యక్ష బాధ్యతలు చేపట్టారన్నారు."

- పార్టీ వర్గాలు

దురదృష్టకరం..

సీనియర్​ నేతలు రాసిన లేఖలపై మన్మోహన్ సింగ్, కేసీ వేణుగోపాల్​ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. అలా లేఖ రాయడం దురదృష్టకరమని మన్మోహన్​ పేర్కొన్నట్టు తెలుస్తోంది. పార్టీ అధిష్ఠానం బలహీనపడితే పార్టీ కూడా బలహీనపడుతుందని వ్యాఖ్యానించినట్లు సమాచారం.

ఆజాద్ స్పందన..

రాహుల్ ఆరోపణలపై స్పందించిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్​.. సీడబ్ల్యూసీలో అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ రాజ్యాంగానికి లోబడే లేఖ రాశామని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ క్రమశిక్షణ నిబంధనలను ఉల్లంఘించినట్లు భావిస్తే తమపై చర్యలు తీసుకోవచ్చని చెప్పినట్లు సమాచారం. అంతకుముందు తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమని ఆజాద్ ప్రకటించినట్లు పార్టీ వర్గాల సమాచారం.

'కుమ్మక్కు'పై దుమారం

'భాజపాతో కుమ్మక్కు' అంటూ రాహుల్‌ వ్యాఖ్యలు చేసినట్లు వచ్చిన వార్తలపై ట్విట్టర్‌ వేదికగా స్పందించారు కపిల్‌ సిబల్‌.

CONG RAHUL
సిబల్ ట్వీట్

"గడిచిన 30 ఏళ్లలో ఏ రోజూ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఏ విషయంలోను వ్యవహరించలేదు. మాట్లాడలేదు. రాజస్థాన్‌లో ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు, మణిపుర్​లో భాజపాను గద్దె దించేందుకు పార్టీ పక్షాన పోరాడాం. అయినా తాము భాజపాతో కుమ్మక్కయ్యామా?

- కపిల్‌ సిబల్‌

కాంగ్రెస్ స్పష్టత..

"భాజపాతో నేతలు కుమ్మక్కయ్యారన్న పదం కానీ, అటువంటి ఉద్దేశంతో కానీ రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేయలేదు. కొన్ని అవాస్తవ కథనాల ఆధారంగా తప్పుడు ప్రచారం జరుగుతోంది. కానీ, కాంగ్రెస్​లో ఒకరినొకరు విమర్శించుకునే బదులుగా.. మోదీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పార్టీ కలిసి పోరాడాల్సిన అవసరం ఉంది" అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్​దీప్ సుర్జేవాలా పేర్కొన్నారు.

కాసేపటికే... తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని రాహుల్ వ్యక్తిగతంగా చెప్పినట్లు వెల్లడించారు సిబల్. అందుకే తన ట్వీట్​ను ఉపసంహరించుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
CONG RAHUL
సిబల్ ట్వీట్

అటు ఆజాద్​ సైతం రాహుల్ వ్యాఖ్యలపై స్పష్టత ఇచ్చారు. కుమ్మక్కు అనే పదం ఉపయోగించలేదని చెప్పారు. సోనియా, రాహుల్ నాయకత్వంపై నమ్మకం ఉందని ఉద్ఘాటించారు.

మరికొంత కాలం సోనియానే..

పార్టీ సారథ్య బాధ్యతలపై సీడబ్ల్యూసీ భేటీలో సుదీర్ఘ సమయం చర్చించిన నేతలు.. ఆర్నెల్లలోపు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని తీర్మానించినట్లు తెలుస్తోంది. అప్పటివరకు సోనియానే బాధ్యతలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

లేఖలో ఏముంది?

దేశంలో కాంగ్రెస్‌ పరిస్థితి, యువత దూరమవుతున్న తీరు.. తదితర అంశాలను లేఖలో ప్రస్తావిస్తూ చిత్తశుద్ధితో ఆత్మవిమర్శ చేసుకోవాలంటూ కపిల్‌ సిబల్‌, గులాం నబీ ఆజాద్‌, పృథ్వీరాజ్‌ చవాన్‌ సహా మొత్తం 23 మంది నేతలు లేఖలో కోరారు. పార్టీ మరింత ముందుకెళ్లేందుకు పూర్తి స్థాయి అధ్యక్షుడి నియామక ఆవశ్యకతను లేఖలో పేర్కొన్నారు.

ఇదీ చూడండి: సీనియర్ల లేఖపై రాహుల్ గాంధీ ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.