ETV Bharat / bharat

వ్యవసాయ చట్టాలకు నిరసనగా 'రాహుల్'​ ట్రాక్టర్​ ర్యాలీ - farm laws

వ్యవసాయ చట్టాలపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. పంజాబ్​, హరియాణాలో ఈ చట్టాలకు వ్యతిరేకంగా రాహుల్​ గాంధీ ఆధ్వర్యంలో ట్రాక్టర్​ ర్యాలీలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది కాంగ్రెస్​. సీఎం అమరీందర్​ సింగ్​ సహా.. పలువురు సీనియర్​ నేతలు హాజరుకానున్నట్లు తెలిపింది. అయితే.. రాహుల్​ ట్రాక్టర్​ ర్యాలీని హరియాణాలోకి అనుమతించబోమని రాష్ట్ర హోంమంత్రి అనిల్​ విజ్​ వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Rahul Gandhi, Punjab CM to take part in two-day tractor rally against farm laws
వ్యవసాయ చట్టాలకు నిరసనగా 'రాహుల్'​ ట్రాక్టర్​ ర్యాలీ
author img

By

Published : Oct 2, 2020, 7:15 AM IST

Updated : Oct 2, 2020, 1:26 PM IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై ఆందోళనలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మోదీ సర్కారుకు వ్యతిరేకంగా.. కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ ఆధ్వర్యంలో పంజాబ్​లో ట్రాక్టర్​ ర్యాలీలు నిర్వహించనున్నట్లు పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. రైతుల తరఫున గళం విప్పనున్నట్లు స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: అకాలీ నేతలు సుఖ్​బీర్​, హర్​సిమ్రత్​ అరెస్టు

అక్టోబర్​ 4 నుంచి 6 వరకు మొత్తం 50 కి.మీ. మేర ఈ నిరసన ఉంటుందని వెల్లడించారు పంజాబ్​ కాంగ్రెస్​ ప్రతినిధి. ఈ ర్యాలీకి రైతు సంఘాల మద్దతు ఉందన్నారు. రోజూ ఉదయం 11 గంటల నుంచి.. కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ నిరసనలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

పంజాబ్​ ముఖ్యమంత్రి అమరీందర్​ సింగ్​, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి హరీశ్​ రావత్​, ప్రదేశ్​ పంజాబ్​ కాంగ్రెస్​ కమిటీ అధ్యక్షుడు సునీల్​ జాఖర్​ సహా రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు ఈ నిరసనల్లో పాల్గొననున్నట్లు వెల్లడించారు.

ఈ వ్యవసాయ చట్టాలతో రైతుల జీవితం అగమ్యగోచరంగా మారుతుందని మొదటినుంచి ఆందోళన వ్యక్తం చేస్తోంది కాంగ్రెస్​.

హరియాణాలోకి అనుమతించం..

రాహుల్​ గాంధీ చేపట్టే ట్రాక్టర్ల ర్యాలీని హరియాణాలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు రాష్ట్ర హోంమంత్రి అనిల్​ విజ్​. పంజాబ్​ కోసం ఆయన ఏమైనా చేసుకోవచ్చని, హరియాణా వాతావరణాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే అడ్డుకుంటామని తెలిపారు.

Last Updated : Oct 2, 2020, 1:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.