దేశం మొత్తం సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. బిహార్‌లో పర్యటించిన ఆయన మోదీ సర్కారుపై విమర్శల వర్షం కురింపించారు. ప్రధాని నిర్వహిస్తోన్న "మై బీ చౌకీదార్" ప్రచారంపై స్పందించారు.
" ఇంటి గేట్ల ముందు చౌకీదార్‌ను ఎవరు నియమించుకుంటారు? సామాన్యుల ఇళ్ల ముందు చౌకీదార్లు నిలబడటం ఎప్పుడైనా చూశారా? దేశ ప్రజలను మోదీ "మిత్రో"(మిత్రులారా) అని పిలుస్తారు. అనిల్ అంబానీ, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలను మాత్రం "భాయ్"(సోదరుడు) అని పిలుస్తారు. మిత్రుల జేబు నుంచి సొమ్ముని తీసి సోదరులకు ఇస్తున్నారు మోదీ. ప్రతి పేదవాడి ఖాతాలో రూ.15 లక్షల జమ, యువకులకు రెండు కోట్ల ఉద్యోగాలు, రైతు రుణాలు మాఫీ చేస్తానని ఎన్నికల ముందు వాగ్దానాలు చేశారు మోదీ. కానీ అమలు చేయలేదు. మేం అధికారం చేపట్టిన తరువాత కనీస ఆదాయ పథకం అమలు చేసి, నేరుగా సొమ్ము పేదల ఖాతాల్లో జమ చేస్తాం. - రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు
ఇదీ చూడండి:హోదా ఎందుకు ఇవ్వరు?: ముఖాముఖిలో రాహుల్