ETV Bharat / bharat

యోగీజీ.. విషాద ఘటనని ఒప్పుకోండి: రాహుల్​ - సీపీఐ హాథ్రస్​ న్యూస్​

హాథ్రస్​ ఉదంతాన్ని విషాదకరమైన ఘటనగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​ ప్రకటించి సభ్యతను చాటుకోవాలన్నారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. మంగళవారం పంజాబ్​లో రైతుల నిరసన కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. హాథ్రస్​​ బాధిత కుటుంబ సభ్యులను వామపక్ష నేతలు పరామర్శించారు. సినీనటికి ఇచ్చిన భద్రత హాథ్రస్​ బాధిత కుటుంబానికి ఎందుకు కల్పించటం లేదని శివసేన ప్రశ్నించింది.

rahul on hathras
హాథ్రస్​ ఘటనపై రాహుల్​ గాంధీ
author img

By

Published : Oct 7, 2020, 10:52 AM IST

హాథ్రస్​లో దళిత యువతి మృతికి దారితీసిన సామూహిక అత్యాచార ఉదంతాన్ని విషాదకరమైన ఘటనగా ప్రకటించి.. ఉత్తర్​ప్రదేశ్​ సీఎం యోగి ఆదిత్యనాథ్​ తన సభ్యతను చాటుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ హితవు పలికారు. దారుణమైన ఘటనలో కుమార్తెను కోల్పోయిన నిరుపేద దళిత కుటుంబానికి అండగా నిలవాలని సూచించారు. జరిగిన ఘోరంపై ప్రధాని మోదీ ఒక్కమాట కూడా మాట్లాడకపోవటాన్ని రాహుల్​ ప్రశ్నించారు. పంజాబ్​లో మంగళవారం.. రైతుల నిరసన కార్యక్రమంలో రాహుల్​ పాల్గొన్నారు. హాథ్రస్​ వెళ్తున్న తనను పోలీసులు నెట్టివెయటంపైనా రాహుల్​ మాట్లాడారు.

" నన్ను తోసివేయటం పెద్ద విషయం కాదు. యావత్తు దేశం దాడికి గురైంది. మనల్ని తోసివేసినా, లాఠీలతో కొట్టినా సరే ప్రజలకు అండగా నిలవటం మన విధి. హాథ్రస్​ ఆందోళనల వెనక అంతర్జాతీయ కుట్ర ఉందని ఊహించుకొనే లేదా అలాంటి అభిప్రాయాన్ని వెల్లడించే విచక్షణాధికారం యోగి ప్రభుత్వానికి ఉంది. అయితే, దళిత యువతికి జరిగిన అన్యాయం విషాదకరమైనదని అంగీకరించటం ముఖ్యం"

-- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అగ్రనేత.

వామపక్షాల నేతల పరామర్శ

హాథ్రస్​ హత్యాచార బాధిత యువతి కుటుంబ సభ్యులను మంగళవారం వామపక్ష నేతలు పరామర్శించారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్​బ్యూరో సభ్యురాలు బృందాకారత్​​, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి అమర్జీత్​ కౌర్ తదితరులు బాధిత కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు.

'సినీ నటికి ఇచ్చిన భద్రత ఆ బాధితులకు కల్పించరా?'

ముంబయికి చెందిన ఓ సినీ నటికి వై-కేటగిరీ భద్రత కల్పించిన ప్రభుత్వం.. హాథ్రస్​ హత్యాచార బాధిత కుటుంబానికి ఎందుకు రక్షణ కల్పించదని శివసేన ప్రశ్నించింది. డా.బీఆర్​ అంబేడ్కర్​ రచించిన రాజ్యాంగాన్ని అమలుచేసే విధానం ఇది కాదని ఆ పార్టీ అధికార పత్రిక 'సామ్నా' సంపాదకీయంలో శివసేన పేర్కొంది.

విలేకరి అరెస్టు

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలకు నిధులు సమకూర్చిందనే ఆరోపణలున్న పీపుల్స్​ ఫ్రంట్​ ఆఫ్​ ఇండియా(పీఎఫ్​ఐ)పై యూపీ పోలీసులు దృష్టిసారించారు. ఈ నేపథ్యంలో ఆయా సంస్థతో సంబంధాలున్నాయంటూ నలుగురు వ్యక్తులను యూపీ పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో దిల్లీ కేంద్రంగా పనిచేసే విలేకరి కూడా ఉన్నారు. హాథ్రస్​ బాధిత కుటుంబాన్ని కలుసుకునేందుకు వెళ్తుండగా వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విలేకరిని తక్షణమే విడుదల చెయ్యాలని కేరళ వర్కింగ్​ జర్నలిస్టుల యూనియన్​ డిమాండ్​ చేసింది.

కేంద్ర మంత్రి రాందాస్​ పరామర్శ
దళిత యువతి కుటుంబానికి న్యాయం చేసేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తామని కేంద్ర మంత్రి రాందాస్​ అఠావలె తెలిపారు. మంగళవారం ఆయన హాథ్రస్​కు వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. హత్యాచార ఘటన తర్వాత హాథ్రస్​ను సందర్శించిన తొలి కేంద్ర మంత్రి ఆయనే.

ఇదీ చూడండి:మహిళలపై దాష్టీకాలకు అంతం లేదా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.