ETV Bharat / bharat

దేశం సుపుత్రుడిని కోల్పోయింది: రాహుల్

జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, భారతీయ నటుడు గిరీశ్ కర్నాడ్ మృతి పట్ల కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. భారత్ అత్యంత ప్రియమైన కుమారుడిని కోల్పోయిందని వ్యాఖ్యానించారు.

author img

By

Published : Jun 10, 2019, 4:35 PM IST

దేశం సుపుత్రుడిని కోల్పోయింది: రాహుల్

భారతీయ నటుడు, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత గిరీశ్ కర్నాడ్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. దేశం సుపుత్రుడిని కోల్పోయిందన్నారు. తన రచనలు, నటన రూపంలో గిరీశ్ బతికే ఉంటారని ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు రాహుల్.

rahul
రాహుల్ గాంధీ ట్వీట్

"నాటకాల రచయిత, నటుడు, దర్శకుడు అన్నింటికి మించి ఓ మంచి మనిషి గిరీశ్ కర్నాడ్ మృతి బాధాకరం. దేశం ఓ సుపుత్రుడిని కోల్పోయింది. ఆయన చేసిన సృజనాత్మక పనుల రూపంలో కర్నాడ్ గుర్తుండిపోతారు."

-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు

కర్నాడ్ మృతి పట్ల కాంగ్రెస్ నేతలు శశిథరూర్, రణ్​దీప్ సుర్జేవాలా విచారం వ్యక్తం చేశారు.

సాంస్కృతిక వారధిని కోల్పోయాం: కుమారస్వామి

కర్నాడ్ మృతిపట్ల స్పందించిన కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్​డీ కుమారస్వామి సాంస్కృతిక వారధిని కోల్పోయామని ట్వీట్ చేశారు.

rahul
కుమారస్వామి ట్వీట్

"సాహిత్యం, నాటక రంగం, సినీ పరిశ్రమకు కర్నాడ్ చేసిన సేవలు మరువలేనివి. మనం ఓ సాంస్కృతిక వారధిని కోల్పోయాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి."

-కుమారస్వామి ట్వీట్

కర్నాడ్ గౌరవార్థం కర్ణాటక ప్రభుత్వం ఒక రోజు సెలవును ప్రకటించింది.

కర్ణాటక భాషకు ఏడో జ్ఞానపీఠ పురస్కారం గిరీశ్ కర్నాడ్ రచనలకు దక్కిందన్నారు మాజీ ప్రధాని దేవెగౌడ.

కర్నాడ్ మృతి బాధాకరమని ట్వీట్ చేశారు భాజపా కర్ణాటక అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప.

ఇదీ చూడండి: కర్నాడ్​ మృతిపై రాష్ట్రపతి, ప్రధాని విచారం

Intro:Body:

ggg

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.