భారత్-చైనా సరిహద్దు అంశమై కేంద్రంపై విమర్శలు కురిపిస్తూనే ఉన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. భారత భూభాగాన్ని ఆక్రమించుకునేలా చైనాకు అవకాశమివ్వడం.. దేశ వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహించడమేనని, కేంద్రం నిజాన్ని దాస్తోందని ఆరోపించారు.
ఈ మేరకు మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ... తన మైక్రోబ్లాగింగ్ సైట్లో మరో వీడియోను విడుదల చేశారు రాహుల్. సరిహద్దు ఉద్రిక్తతలపై రాహుల్.. వీడియో విడుదల చేయడం ఇది నాలుగోసారి. అంతకుముందు జులై 17,20,23 తేదీల్లోనూ మోదీ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
-
The Chinese have occupied Indian land.
— Rahul Gandhi (@RahulGandhi) July 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Hiding the truth and allowing them to take it is anti-national.
Bringing it to people’s attention is patriotic. pic.twitter.com/H37UZaFk1x
">The Chinese have occupied Indian land.
— Rahul Gandhi (@RahulGandhi) July 27, 2020
Hiding the truth and allowing them to take it is anti-national.
Bringing it to people’s attention is patriotic. pic.twitter.com/H37UZaFk1xThe Chinese have occupied Indian land.
— Rahul Gandhi (@RahulGandhi) July 27, 2020
Hiding the truth and allowing them to take it is anti-national.
Bringing it to people’s attention is patriotic. pic.twitter.com/H37UZaFk1x
''చైనా.. భారత భూభాగాన్ని ఆక్రమించుకుంది. నిజాన్ని దాస్తూ.. జాతి ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించింది. దీనిని ఇప్పుడు ప్రజల దృష్టికి తీసుకొచ్చి.. దేశభక్తిని చాటుకొనే ప్రయత్నం చేస్తోంది.''
- రాహుల్ గాంధీ , కాంగ్రెస్ అగ్రనేత
చైనా దళాలు చొచ్చుకురావడం తనకు తీవ్ర ఆవేదన కలిగించిందని అన్నారు రాహుల్. అసలు వేరే దేశ సైన్యం.. భారత్లోకి ఎలా ప్రవేశించగలదని ప్రశ్నించారు. ఇలాంటివి చూస్తుంటే తన రక్తం మరిగిపోతోందని పేర్కొన్నారు కాంగ్రెస్ నేత.
''రాజకీయాల్లో ఉంటూ మౌనంగా కూర్చోలేను. ప్రజలకు అబద్ధం చెప్పలేను. నేను శాటిలైట్ ఫొటోలు చూశాను. ఆర్మీ మాజీ అధికారులతో మాట్లాడాను. చైనా.. భారత భూభాగంలోకి రాలేదని మీరు నమ్మించే ప్రయత్నాలు చేసినా నేను నమ్మను. నా రాజకీయ జీవితం ఏమైనా.. నేను అబద్ధం చెప్పలేను.''
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
చైనా.. భారత భూభాగాన్ని ఆక్రమించలేదని చెప్పేవారు జాతీయ వాదులు కాదని, వారికి దేశ భక్తి లేదని మండిపడ్డారు రాహుల్.
ఇటీవలి కాలంలో భారత్,చైనా మధ్య గల్వాన్ లోయలో తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగాయి. సుదీర్ఘ.. సైనిక, దౌత్య స్థాయి చర్చల అనంతరం బలగాల ఉపసంహరణపై ఇరు దేశాలు ఒక అంగీకారానికి వచ్చిన అనంతరం.. పరిస్థితులు కాస్త సద్దుమణిగాయి.