'దొంగలందరి పేరులో మోదీ ఉంటుంది ఎందుకు?' అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించటంపై కోర్టును ఆశ్రయించారు బిహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ. కాంగ్రెస్ అధ్యక్షుడిపై పట్నా కోర్టులో పరువు నష్టం దావా వేశారు మోదీ.
పట్నా కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కుమార్ గుజ్నన్ ముందు ఐపీసీ సెక్షన్ 500 ప్రకారం కేసు నమోదు చేశారు మోదీ. ఏప్రిల్ 13న మహరాష్ట్రలో జరిగిన సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనతో పాటుగా మోదీ పేరున్న వారి కీర్తిని దెబ్బతీసిందని తెలిపారు. ఈ విషయంపై ఫిర్యాదు స్వీకరించిన కోర్టు ఈ నెల 22 న విచారణ చేపట్టనుంది.
గత సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు చేశారు రాహుల్ గాంధీ. పరారీలో ఉన్న నీరవ్ మోదీ, ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీలను పేర్కొంటూ దొంగలందరి పేరులో మోదీ ఉంటుంది ఎందుకంటూ ప్రశ్నించారు రాహుల్. ఇంకెంత మంది మోదీలు బయటకు వస్తారో మనకు తెలియదని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: "బడ్జెట్లోనే రైతులకు కనీస మద్దతు ధర ప్రకటన"