కాంగ్రెస్ నేత రాహుల్పై తీవ్ర విమర్శలు చేశారు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. రక్షణ రంగంపై పార్లమెంటు స్టాండింగ్ కమిటీ నిర్వహించిన ఒక్క సమావేశానికి కూడా హాజరుకాని రాహుల్... సైన్యాన్ని నిరుత్సాహపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
దేశ సైన్యాన్ని నిరుత్సాహపర్చడం, సైనిక బలగాల పరాక్రమాన్ని శంకించడం ఓ బాధ్యత గల విపక్ష నేతకు తగదని నడ్డా హితవు పలికారు. రాహుల్ గాంధీ... రక్షణరంగ కమిటీల కన్నా కమీషన్లకే ప్రాధాన్యం ఇచ్చిన వంశానికి చెందిన వారని ఎద్దేవా చేశారు. పార్లమెంటరీ వ్యవహారాలను అర్థం చేసుకోగల నాయకులు కాంగ్రెస్ పార్టీలోనూ ఉన్నారన్న నడ్డా... వారిని ఓ వంశం ఎదగనీయకపోవడం బాధాకరమన్నారు.
ఇదీ చూడండి: 'కేంద్రం వైఫల్యం హార్వర్డ్ కేస్ స్టడీగా మారుతుంది'