ETV Bharat / bharat

మోదీ.. సంపన్నుల లౌడ్ ​స్పీకర్​: రాహుల్

వ్యాపారవేత్తలకు లౌడ్ ​స్పీకర్​లా ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. హరియాణా నూహ్​లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మోదీపై విమర్శలు గుప్పించారు.

author img

By

Published : Oct 14, 2019, 8:05 PM IST

Updated : Oct 14, 2019, 9:31 PM IST

మోదీ.. సంపన్నుల లౌడ్ ​స్పీకర్​: రాహుల్
మోదీ.. సంపన్నుల లౌడ్ ​స్పీకర్​: రాహుల్

ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలతో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ. మోదీ ధనికుల పక్షపాతి అని ఆరోపించారు. పేదల జేబుల నుంచి డబ్బుని తీసుకెళ్లి బడా వ్యాపారవేత్తలకు చేరవేస్తున్నారని ధ్వజమెత్తారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నూహ్​లో తొలి ర్యాలీలో పాల్గొన్నారు రాహుల్. ఆ రాష్ట్ర సీఎం మనోహర్​లాల్ ఖట్టర్, మోదీలపై విమర్శలు గుప్పించారు. భాజపా, ఆర్​ఎస్ఎస్​లు విభజించు పాలించు విధానాన్ని ఆచరిస్తున్నాయని ధ్వజమెత్తారు రాహుల్​.

" భాజపా, ఆర్​ఎస్​ఎస్​ల పని గతంలో ఆంగ్లేయులు చేసినట్లుగా దేశాన్ని విభజించడం, ఒకరితో మరొకరికి గొడవలు పెట్టడం. నరేంద్ర మోదీ 15 మంది ధనికులకు కార్పొరేట్​ పన్ను రద్దు చేశారు. రూ.లక్షా నలబై వేల కోట్లు ఒక్క రోజులో మాఫీ చేశారు. ఈ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలను 15 నుంచి 20 మందికి చేరవేస్తోంది. వాళ్లు దేశం విడిచి పారిపోతున్నారు. విజయ్​ మాల్యాలా.. ఫ్రాన్స్​, అమెరికా, లండన్​లో తలదాచుకుంటున్నారు . "
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత

ట్రంప్, అంబానీలను మాత్రమే మోదీ కలుస్తారని, రైతుల వైపు ఏనాడూ చూడరని తీవ్ర ఆరోపణలు చేశారు రాహుల్​. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు పేదలు, రైతులకు ఆర్థిక సాయం అందించాలని రాహుల్ అన్నారు. అందుకే కాంగ్రెస్ న్యాయ్ పథాకాన్ని లోక్​సభ ఎన్నికల సమయంలో రూపొందించిందని గుర్తు చేశారు.

ఇదీ చూడండి: కశ్మీర్​పై కాంగ్రెస్​ది మొసలి కన్నీరు: మోదీ

New Delhi, Oct 14 (ANI): Union Minister of Finance Nirmala Sitharaman met Chief Managing Directors (CMDs) of Public Sector in Delhi on October 14. She reviewed the fund flow to stressed MSME (Micro, Small and Medium Enterprises) sector. While speaking to CMDs, Sitharaman assured Micro, Small and Medium Enterprises (MSMEs) that their due amount, owned by other companies will be cleared before this Diwali. She said, "The Corporate Affairs Ministry has a complete list of companies which stated that they owe MSMEs nearly Rs 40,000 crores. Secretary corporate affairs and Secretary banking will ensure that the data, in desegregated form, is given to these banks. The banks then shall make an attempt to approach all of these MSMEs and ask them if want a bill discounting because that is openly claimed by the companies. By 22nd, I have asked them to report back saying if the MSMEs are willing to have the bill discounted and collect the money." She further said, "I've requested the Secretary MCA to write to all these companies that 'you have claimed this is what has to be paid to the MSMEs. Will you expedite the payment and get that cleared'. So, we are taking a two-pronged approach so that MSMEs, before Diwali, will get the due amount."

Last Updated : Oct 14, 2019, 9:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.