సాధారణ ప్రజానీకం కోసం జమ్ముకశ్మీర్‌లో మూడు వందల టెలిఫోన్లను ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం. ఇందుకోసం ప్రత్యేక అధికారులను నియమించింది. స్థానిక ప్రజానీకం వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న తమ కుటుంబసభ్యులతో మాట్లాడుకునేందుకు, జమ్ముకశ్మీర్‌లో చదువుకుంటున్న విద్యార్థులు తమ తల్లిదండ్రులతో సంభాషించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది. గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక ఫోన్ల ఏర్పాటుపై అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇతర రాష్ట్రాల్లో చదువుకుంటూ బక్రీద్ కోసం కశ్మీర్‌కు రావాలనుకుంటున్న స్థానిక యువతీ, యువకులకు సహాయ కార్యక్రమాలు కొనసాగించాలని గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చూడండి: ఈ ప్రత్యేకమైన మేక ఖరీదు రూ. 8 లక్షలు!