రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రఘువంశ్ ప్రసాద్ సింగ్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. మంగళవారం పట్నా ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరిన ఆయనకు కొవిడ్-19 పరీక్షలు నిర్వహించగా.. వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. గతంలో కేంద్రమంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు రఘువంశ్.
జలుబు, దగ్గుతో పాటు ఇతర కరోనా లక్షణాలు బయటపడినందున ముందు జాగ్రత్తగా మంగళవారమే ఆసుపత్రిలో చేరారు రఘువంశ్. ప్రస్తుతం ఆయనను ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
అనుమతి నిరాకరణ..
కరోనాతో బాధపడుతున్న తమ పార్టీ ఉపాధ్యక్షుడిని పరామర్శించేందుకు తేజస్వీ యాదవ్ అనుమతి కోరగా ఎయిమ్స్ అధికారులు నిరాకరించినట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి : దేశం ఏదైనా... దౌర్జన్యమే డ్రాగన్ విధానం