ETV Bharat / bharat

హైదరాబాద్​ వర్సిటీకి ర్యాంక్​ మిస్సైంది అందుకే...

ప్రతిష్టాత్మక క్యూఎస్​ ర్యాంకింగ్స్​లో భారతీయ విశ్వవిద్యాలయాలు మంచి స్థానాలను కైవసం చేసుకోవడంపై మానవ వనరుల శాఖ దృష్టి పెట్టింది. వివిధ విశ్వవిద్యాలయాల ఉన్నతాధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. వైఫల్యానికి గల కారణాలపై చర్చించి తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించింది.

author img

By

Published : Jul 7, 2019, 1:38 PM IST

హైదరాబాద్​ వర్సిటీకి ర్యాంక్​ మిస్సైంది అందుకే...

మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్​ విశ్వవిద్యాలయం సహా దేశంలోని వివిధ ప్రతిష్టాత్మక విద్యా సంస్థల ఉన్నతాధికారులు దిల్లీలో ఇటీవల సమావేశమయ్యారు. ఎంతో గౌరవంగా భావించే క్వాక్వారెల్లి సైమండ్స్(క్యూఎస్​)​ ర్యాంకింగ్స్​లో భారత విశ్వవిద్యాలయాలు వెనుకంజ వేయడంపై ఈ భేటీలో చర్చించారు. దిల్లీలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి లండన్​కు చెందిన క్యూఎస్​ సంస్థ అధికారులూ హాజరయ్యారు.

విద్యా ఖ్యాతి, యజమాని ప్రతిష్ఠ, అధ్యాపక-విద్యార్థుల నిష్పత్తి, అంతర్జాతీయ అధ్యాపకులు, అంతర్జాతీయ విద్యార్థులు వంటి అంశాల ఆధారంగా ర్యాంకింగ్స్​ను అందజేస్తుంది క్యూఎస్​.

నాణ్యతలో భేష్​... కానీ

నాణ్యత, విశ్వసనీయత వంటి అంశాల్లో మన విశ్వవిద్యాలయాలు ముందున్నాయని... కానీ క్యూఎస్​ వీటిని పరిగణించదని ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్రమంత్రి రమేశ్​ పోఖ్రియల్​ పేర్కొన్నారు. ఇతర అంశాలను పరిగణించి ర్యాంకింగ్స్​లో అగ్రస్థానాలు కైవసం చేసుకోవడానికి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.

అందుకే అగ్రస్థానాలు లేవు...

అండర్​ గ్రాడ్యుయేట్​ కోర్సుల్లో అశ్రద్ధ వహించడం వల్లే మెరుగైన ర్యాంకులు పొందలేకపోతున్నామని హైదరాబాద్​ విశ్వవిద్యాలయ వైస్​ ఛాన్సలర్​ పొడిలె అప్పారావు వెల్లడించారు. ర్యాంకుల ఇవ్వడంలో పక్షపాతం ఉండకుండా క్యూఎస్​ జ్యూరీలో భారతీయులు ఉండాలని మరికొందరు అధికారులు అభిప్రాయపడ్డారు.

క్యూఎస్​ ర్యాంకుల్లో మన స్థానాలు...

  • టాప్​ 200- ఐఐటీ బాంబే, ఐఐటి దిల్లీ, ఐఐఎస్​సీ బెంగళూరు.
  • టాప్​ 400- ఐఐటీ మద్రాస్​, ఐఐటి ఖరగ్​పూర్​, ఐఐటీ కాన్పూర్​, ఐఐటీ రూర్కీ.
  • 2018లో 472 స్థానంలో ఉన్న ఐఐటీ గువహటి... ఈసారి 491 స్థానానికి పడిపోయింది.

2020 క్యూఎస్​ గ్లోబల్​ ర్యాంకింగ్స్​ జూన్​లో విడుదలయ్యాయి.

ఇదీ చూడండి:- 'కర్​నాటకం'లో కాంగ్రెస్​ ఆఖరి ప్రయత్నాలు

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide excluding USA, Canada, Japan and Korea. Max use 2 minutes per day. Use within 24 hours. No archive. No internet. Must credit source. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: T-Mobile Park, Seattle, Washington, USA. 6th July 2019.
Bottom of the 5th inning:
1. 00:00 Wei-Chung Wang warming up in bullpen
2. 00:10 Wang walks Omar Narvaez, run scores for Seattle to lead 5-2
3. 00:37 Kyle Seager sacrifice fly for Seattle to lead 6-2
SOURCE: MLB
DURATION: 00:58
STORYLINE:
Wei-Chung walked two batters, forcing in a run, in Oakland's 6-3 loss at Seattle Saturday night.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.