ETV Bharat / bharat

చారిత్రక పిపిలీ హస్తకళ కనుమరుగు! - pipili hand made arts extinction satge

ప్రతి ప్రాంతానికి ప్రత్యేక వేషధారణ, ఆహారపు అలవాట్లు, సంస్కృతి, సంప్రదాయాలు, ఆలయాలు ఉన్నట్లే...ఆయా ప్రాంతాలు బట్టి, విభిన్న హస్తకళలు ఉంటాయి. ఒడిశాలోని పూరీలో జగన్నాథ స్వామి ఆలయం ఎంత ప్రత్యేకమో, ఆ రాష్ట్రంలోని మరో నగరం పిపిలీ అల్లికల పరిశ్రమ కూడా అంతే ప్రత్యేకం. ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన ఈ హస్తకళ... తన వైభవం కోల్పోతుండడం బాధాకరం.

puri-pipili-hand-art
కనుమరుగవుతోన్న చారిత్రక పిపిలీ హస్తకళ
author img

By

Published : Oct 18, 2020, 2:03 PM IST

కనుమరుగవుతోన్న చారిత్రక పిపిలీ హస్తకళ

ఒడిశాలోని పిపిలీ అల్లికలు.. సునిశిత కళకు, సంస్కృతికి ప్రతీకగా నిలుస్తున్న కళాఖండాలు. అప్పట్లో ఉత్కల్‌గా పేరొందిన పురాతన ఒడిశాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఈ ప్రాచీనకళ రాష్ట్రానికి ప్రత్యేక శోభ తెచ్చింది. పూరీని సందర్శించే అంతర్జాతీయ ప్రర్యటకులకు పిపిలీ నగరం ప్రత్యేక ఆకర్షణ.

12వ శతాబ్దం నుంచే..

ఈ హస్తకళ 12వ శతాబ్దం నుంచే పూరీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. మొదట్లో ఈ కళతో కళాకారులు పెద్దపెద్ద గొడుగులు, జెండాలు, విసెనకర్రలు, కుంచెలు తయారుచేసి, జగన్నాథ స్వామికి పంపేవారు. ఇక్కడ తయారుచేసిన పందిళ్లను పండగల వేళ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేసేవారు. చేపలు, చిలకలు, అరటాకులు, తులసి దళాల చిత్రాలతో వాటిని సుందరంగా తీర్చిదిద్దేవారు.

"ఈ అల్లికలు ఎప్పటినుంచి జగన్నాథాలయం సంప్రదాయంలో భాగంగా ఉన్నాయో కచ్చితంగా చెప్పడం కొంచెం కష్టమే. జగన్నాథ స్వామి ఆలయానికి, ఈ అల్లికలకు ఉన్న సంబంధం నాణేనికి చెరో వైపు లాంటింది. జగన్నాథుడి ప్రత్యేక కార్యక్రమాలు చాండువాల కిందే జరుగుతాయి. జగన్నాథుడి లాగే ఈ అల్లికలు కూడా ప్రత్యేకం."

---డా. నరేష్ డాష్, జగన్నాథ్ కల్చర్ పరిశోధనకారుడు

వేలాది కుటుంబాలకు జీవనాధారం

పిపిలీ అల్లికలకు క్రమంగా డిమాండ్ పెరగడం వల్ల డిజైన్లలో ఎన్నో మార్పులు వచ్చాయి. వినియోగదారులను ఆకర్షించేందుకు కళాకారులు విభిన్న ఆకృతులతో అందమైన అలంకరణ వస్తువులు తీర్చిదిద్దుతున్నారు. పర్సులు, వాల్ హ్యాంగింగ్స్, టేబుల్ క్లాత్ లాంటి వస్తువులు చేసి, విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఇదో పరిశ్రమ స్థాయికి ఎదిగి, వేలాది కుటుంబాలకు జీవనాధారంగా మారింది.

పూరీ నుంచి ప్రపంచ స్థాయికి..

ఈ అల్లికలకు ప్రపంచ మార్కెట్లో ప్రచారం కల్పించి, కళాకారుల ఆదాయం పెంచే ఆశయంతో రాష్ట్ర ప్రభుత్వం 1957లో కనోపీ సొసైటీ ఏర్పాటు చేసింది. 30 మంది కళాకారులు ఈ సంఘంలో సభ్యులుగా ఉన్నారు. పూరీ- భువనేశ్వర్ జాతీయ రహదారి నిర్మించిన తర్వాత పూరీకి వచ్చేవారిలో తక్కువ మందే పిపిలీని సందర్శిస్తుండడం వల్ల తమ గిరాకీ తగ్గిపోయిందని కళాకారులు ఆవేదన చెందుతున్నారు.

"మునుపటి కంటే మా ఆదాయం తగ్గిపోయింది. 2015 నుంచి పిపిలీ ఎక్కడుంటుందో కనిపెట్టడం ప్రజలకు కష్టమై పోయింది. పిపిలీ బైపాస్ రోడ్‌ వెంబడి నిర్మించిన డివైడర్ ఆటంకంగా మారింది. "

-----అతార్ అలీ, అల్లికల సంఘం సెక్రటరీ.

దేశ రాజధాని దిల్లీ నుంచి, రంగుల ప్రపంచం బాలీవుడ్ వరకు దేశవ్యాప్తంగా పిపిలీ పరదాలు తమ ప్రత్యేకత చాటుకున్నాయి. ఒడిశాకు చిహ్నంగా నిలుస్తున్న ఈ హస్తకళా రంగం పునరాభివృద్ధికి నోచుకోకపోతే.. భారీ నష్టాలు మూటగట్టుకునే ప్రమాదం కనిపిస్తోందని స్థానికులు వాపోతున్నారు.

"ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందా అని చూస్తున్నాం. ప్రభుత్వం మా అల్లికలకు సరైన ప్రచారం కల్పిస్తే ఎంతోమంది కళాకారులు పిపిలీ నుంచి విదేశాలకు వెళ్లి, తమ ప్రతిభ, చరిత్ర, సంప్రదాయాలను ఎగ్జిబిషన్లలో ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉన్నారు."

---ప్రదీప్ మోహపాత్ర, వ్యాపారి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.